Bandi Sanjay: మోదీ కాంగ్రెస్‌ని విమర్శిస్తే టీఆర్ఎస్‌కి ఎందుకు నొప్పి?
ప్రధాని మోదీ కాంగ్రెస్‌ని విమర్శిస్తే టీఆర్ఎస్‌కి ఎందుకు నొప్పి? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

Bandi Sanjay
Bandi Sanjay: ప్రధాని మోదీ కాంగ్రెస్‌ని విమర్శిస్తే టీఆర్ఎస్‌కి ఎందుకు నొప్పి? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మా పార్టీ మద్దతు వల్లే తెలంగాణ సాధ్యమైంది. పెప్పర్ స్ప్రే కొట్టినా కదలకుండా సుష్మా స్వరాజ్ లోక్ సభలో ఉండి తెలంగాణ బిల్లు పాస్ చేయించారు. నాడు చంద్రబాబు అడ్డుపడటం వల్లే వాజ్‌పేయి హయాంలో తెలంగాణ సాధ్యం కాలేదు.
తెలంగాణకు మోసం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీనీ ఖతం చేశారని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ పార్లమెంట్‌లో విభజన బిల్లు చర్చలో ఎందుకు పాల్గొనలేదు అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం దొంగ దీక్ష చేశారని, తెలంగాణ కేబినెట్‌లో ఎంతమంది ఉద్యమకారులు మంత్రులుగా ఉన్నారని ప్రశ్నించారు.
తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, తెలంగాణ ఉద్యమకారులు బీజేపీలో ఎందుకు చేరుతున్నారో చెప్పాలని, తెలంగాణను సమర్ధించింది బీజేపీ కాబట్టే బీజేపీలో చేరుతున్నారు అని అన్నారు. బీజేపీ రాగానే తెలంగాణ ఇస్తుందన్న భయంతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు.
కేసీఆర్ ప్రజల దృష్టి మరల్చే పని చేస్తున్నారని, నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం రాజ్యమేలడానికా తెలంగాణ వచ్చింది అని నిలదీశారు.
మోదీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదని, విభజన జరిగిన తీరు సరికాదని అన్నారని వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయమని కేసీఆర్ ప్రధానిని అడిగారా? అని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయడం చేతకాని కేసీఆర్ రాజినామా చేయాలని డిమాండ్ చేశారు.