గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో ప్రయాణికులకు వైఫ్ సౌకర్యం!

దీంతో ఆదాయం కూడా వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.

గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో ప్రయాణికులకు వైఫ్ సౌకర్యం!

Updated On : July 2, 2025 / 8:02 AM IST

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో వైఫై సేవలు అందనున్నాయి. బస్సులు, బస్ స్టేషన్లలో ప్రయాణికులకు వైఫ్ సౌకర్యాన్ని కల్పించేందుకు ఆర్టీసీ ఓ ప్రైవేట్ ఇంటర్నెట్ సంస్థతో చర్చలు జరిపింది. అనంతరం దీనిపై తెలంగాణ సర్కారుకు ఆర్టీసీ వివరాలు తెలిపింది.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో ఆర్టీసీ అధికారులు వైఫై సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై పొన్నం ప్రభాకర్‌ సానుకూలంగా స్పందించారు. వైఫై సౌకర్యాలు కల్పించేందుకు అంగీకరించారు.

Also Read: ఈ 2 స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్‌? కొనేముందు ఇవి తెలుసుకోవాల్సిందే..

ఆర్టీసీ తమ ప్లాన్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. బస్సులు, బస్ స్టేషన్లలో ఒకేసారి వైఫై సౌకర్యాన్ని అమలు చేయనున్నారు. అయితే, ఇందులో భాగంగా తొలి దశలో ప్రయాణికులకు వారి స్మార్ట్‌ఫోన్లలో సెలెక్ట్ చేసిన పలు మూవీస్‌, పాటల వంటి సౌకర్యాలే అందుతాయి.

రెండో దశలో సాధారణ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తారు. మూవీలు, పాటలు ప్లే అవుతున్న సమయంలో మధ్యలో యాడ్స్‌ కూడా వస్తాయి. దీంతో ఆదాయం కూడా వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ ఆదాయంలో ఇంటర్నెట్ కంపెనీకి, ఆర్టీసీ యాజమాన్యానికి చె సగం చొప్పున తీసుకోనున్నారు.