Rape On Girl : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు..కీలకంగా మారిన ఇన్నోవా కారు
మరోవైపు గవర్నమెంట్ వెహికల్‌గా ఇన్నోవా కారుకు టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే హైదరాబాద్‌లో ఇన్నోవా తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడే ఇన్నోవాను తీసుకొచ్చాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

Innova Car
girl gang rape : జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన కేసులో మిస్టరీ చోటుచేసుకుంది. బాలిక గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో ఇన్నోవా కారు కీలకంగా మారింది. బెంజ్ కారు దొరికినా.. ఇన్నోవా కారు ఇప్పటికి ఎక్కడుందనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో కారు అదృశ్యంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితులు వాడిన ఇన్నోవా ఇప్పటికీ కనిపించకపోవడంతో ఆ కారును ఎక్కడ దాచారన్నది మిస్టరీగా మారింది. మాయం చేసిన ఇన్నోవా కోసం పోలీసులు సిటీలో విస్తృతంగా గాలిస్తున్నారు. వందలాది సీసీ కెమెరాల ఫుటేజ్‌ను విస్తృతంగా పరిశీలిస్తున్నారు.
మరోవైపు గవర్నమెంట్ వెహికల్‌గా ఇన్నోవా కారుకు టెంపరరీ రిజిస్ట్రేషన్ జరిగిందని పోలీసులు గుర్తించారు. నెంబర్ ప్లేట్ లేకుండానే హైదరాబాద్‌లో ఇన్నోవా తిరిగింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడే ఇన్నోవాను తీసుకొచ్చాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఛైర్మన్ తనయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఒకరిని అరెస్ట్ చేయగా, ఇవాళ మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురు నిందితులను కర్ణాటకలో అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో సాజిద్ మాలిక్ తో పాటు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడు(16)కూడా ఉన్నాడు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన జూబ్లీ హిల్స్ పోలీసులు గత ఐదు రోజులుగా గాలింపు చేపట్టి ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. కేసు పూర్తిగా విచారణ జరిగితే మరికొన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.