Electric Shock Student Died : ఖమ్మం జిల్లా నవోదయ విద్యాలయంలో విద్యుత్ షాక్ కు గురై ఇంటర్ విద్యార్థి మృతి
ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్న క్రమంలో 11 కేవీ వైర్లు తగలడంతో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.

electric shock student died
Jawahar Lal Navodaya Vidyalaya : ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ లాల్ నవోదయ విద్యాలయంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కు గురై ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. పాలేరులోని జవహర్ లాల్ నవోదయ విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.
దీంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. విద్యాలయానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి చెందిన ఫ్లెక్సీ బ్యానర్లను విద్యార్థులు కడుతున్నారు. ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్న క్రమంలో 11 కేవీ వైర్లు తగలడంతో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.
Fire Accident : ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో భారీ అగ్ని ప్రమాదాలు
వీరిలో తీవ్ర గాయాలైన ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. దీంతో విద్యాలయంలో కలకలం రేగింది. కాగా, పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.