Income Tax Raids : పైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి నివాసాలపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమనులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

Income Tax Raids : పైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి నివాసాలపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

BRS Leaders

BRS Leaders : తెలంగాణలో అధికార పార్టీ(బీఆర్ఎస్)నేతలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలోని శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి సోదాలు జరుగుతున్నాయి.

జేసీ బ్రదర్స్ షోరూమ్స్ తో పాటు అమీర్ పేట్ లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్దన్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

BRS : లోక్ సభలో టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు

మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమనులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పైళ్ళ శేఖర్ రెడ్డి బ్యాంకు లాకర్స్ ను సైతం ఐటీ అధికారులు ఓపెన్ చేశారు. మరోవైపు ఐటీ అధికారుల సోదాలపై బీఆర్ఎస్ శ్రేణులు మండి పడుతున్నారు.