IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు

ఐటీ అధికారులు హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లోకూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితా ఉన్నారు.

IT Raids : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు

BRS MLA Shekhar Reddy

Updated On : June 14, 2023 / 4:46 PM IST

IT Raids : భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) ఫైళ్ళ శేఖర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నాయి. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలోని ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఫైళ్ల శేఖర్ రెడ్డి తీర్థ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక‌లో పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది. సౌత్ ఆఫ్రికా‌లో మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

IT Rides: హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. మైత్రి మూవీస్, దర్శకుడు సుకుమార్ కార్యాలయాల్లో రైడ్స్

ఐటీ అధికారులు హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లోకూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితా కొనసాగుతున్నారు. ఐటీ అధికారులు ఏక కాలంలో 12చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇన్‌కంట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. తీర్థ గ్రూప్‌కి ఫైళ్ల శేఖర్‌రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్టర్లుగా ఉన్నారు.