Child Labour : పిల్లలతో పని చేయిస్తే.. ఏడాది జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

బాల కార్మిక వ్యవస్థను రూపుమాపే దిశ‌గా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల‌లోపు చిన్నారుల‌తో ప‌ని చేయించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం..

Child Labour : పిల్లలతో పని చేయిస్తే.. ఏడాది జైలుశిక్ష, రూ.50వేలు జరిమానా.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Child Labour

Updated On : December 16, 2021 / 10:30 PM IST

Child Labour : బాల కార్మిక వ్యవస్థను రూపుమాపే దిశ‌గా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల‌లోపు చిన్నారుల‌తో ప‌ని చేయించుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. ఒక వేళ 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పని చేయించుకుంటే… 6 నెలల నుంచి ఏడాది జైలు శిక్ష‌ విధిస్తామ‌ని తెలిపింది. అంతేకాదు రూ.20 వేల నుంచి రూ.50 వేల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులే అని చెప్పింది.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

బాల‌కార్మిక వ్య‌వ‌స్థ నిర్మూల‌న‌, ప‌ర్య‌వేక్ష‌ణ కోసం జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో టాస్క్‌ఫోర్స్ క‌మిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లపై కూడా కార్మికశాఖ నిబంధనలు రూపొందించింది. సినిమాలు, ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు తేల్చి చెప్పారు.