Head Master Beats Students : వామ్మో.. 5 నిమిషాలు లేటుగా వచ్చారని పిల్లలను గొడ్డును బాదినట్లు బాదిన హెడ్మాస్టర్
హైదరాబాద్ జామై ఉస్మానియాలోని ప్రభుత్వ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్కూల్ కి ఆలస్యంగా వచ్చారనే కారణంతో స్కూల్ హెడ్ మాస్టర్ చిరంజీవి పదో తరగతి విద్యార్థులను చితకబాదాడు. గొడ్డును బాదినట్లు వారి బాదాడు.

Head Master Beats Students : హైదరాబాద్ జామై ఉస్మానియాలోని ప్రభుత్వ పాఠశాలలో అమానుష ఘటన చోటు చేసుకుంది. స్కూల్ కి ఆలస్యంగా వచ్చారనే కారణంతో స్కూల్ హెడ్ మాస్టర్ చిరంజీవి పదో తరగతి విద్యార్థులను చితకబాదాడు. గొడ్డును బాదినట్లు వారి బాదాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
నిన్న స్కూల్ కి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని ఆగ్రహించిన హెడ్ మాస్టర్.. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల ఒంటి మీద గాయాలు చూసి తల్లిదండ్రులు చలించిపోయారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్ కి వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
Also Read..Teacher Drink Alcohol : మద్యం సేవించి క్లాస్ రూమ్ లో నేలపై నిద్రించిన ఉపాధ్యాయుడు
తమ పిల్లలను ఎందుకింత దారుణంగా కొట్టారని మండిపడ్డారు. కాగా, హెడ్ మాస్టర్ తమను ఇలా దారుణంగా కొట్టడం తొలిసారి కాదని, రెండోసారి అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కి వచ్చేసరికి హెడ్ మాస్టర్ లేకపోవడంతో చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీని ఆశ్రయించారు. అయితే, హెడ్ మాస్టర్ చిరంజీవి.. ముషీరాబాద్ డిప్యూటీ డీఈవో పదవిలో ఉన్నారు.
Also Read..Dammaiguda Girl Death Case : దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం కేసులో వీడిన మిస్టరీ
”మేము రామాంతాపూర్ నుంచి ఆటోలో రావాలి. 8.50 అయ్యింది. అప్పటికి ప్రేయర్ అవుతుంది. ప్రేయర్ లో పాల్గొనేందుకు వద్దామని లోపలికి వస్తున్నాం. అక్కడే మమ్మల్ని సార్ ఆపేశాడు. ఏటికి పోతున్నావ్ అని సార్ అడిగారు. ప్రేయర్ కి సార్ అని చెప్పాం. ఇక్కడే ఆగు అన్నారు. చెప్పండి సార్ అని అడిగాం. ఆ కటింగ్ ఏంటి? అని అడిగారు. ఆ తర్వాత విచక్షణారహితంగా కొట్టారు. చాలా డేంజర్ గా కొట్టాడు. ఆయన ఎంత కోపంలో కొడుతున్నాడంటే.. అసలు ఆయనకు కూడా తెలియడం లేదు. కళ్లు ఎర్రగా అయిపోయాయి. అతడసలు మనిషే కాదు” అని బాధిత విద్యార్థి వాపోయాడు.
హెడ్ మాస్టర్ తీరుపై బాధిత పిల్లల తల్లిదండ్రులు మండిపడ్డారు. పిల్లలను మందలించొచ్చు, కొట్టొచ్చు.. తప్పు లేదు.. కానీ, ఇంత ఘోరంగా కొడతారా? గొడ్డును బాదినట్లు బాదుతారా? అని హెడ్ మాస్టర్ పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పిల్లలు ఏం తప్పు చేశారని అంత దారుణంగా కొట్టారు అని ప్రశ్నించారు. పిల్లలకు ఏమైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అని నిలదీశారు.