BJP: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం.. తెలంగాణకు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి నియామకం

చంద్రశేఖర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం రాజస్థాన్ బీజేపీ సంస్థ గత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

BJP: లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం.. తెలంగాణకు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి నియామకం

Chandrashekhar

Updated On : January 15, 2024 / 9:51 PM IST

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ తెలంగాణకు సంస్థాగత ప్రధాన కార్యదర్శిని నియమించింది. తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు బీజేపీ జాతీయ నాయకత్వం తెలిపింది. చంద్రశేఖర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం రాజస్థాన్ బీజేపీ సంస్థ గత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Raghu Rama Krishna Raju: పొత్తులో టీడీపీ-జనసేనతో పాటు బీజేపీ..: రఘురామకృష్ణరాజు

లోక్‌సభ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగాల్సి ఉన్న వేళ బీజేపీ దక్షిణాదిన వీలైనన్ని సీట్లలో గెలవడానికి ప్రణాళికలు వేసుకుంటోంది. తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లు సాధించింది.

లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం వేసుకుంటున్న వ్యూహాల్లో భాగంగా దక్షిణాదిన కీలక చర్యలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ కర్ణాటకలో మినహా ఎక్కడా అంతగా ప్రభావం చూపలేదు.

దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం కలిపి 133 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది కేవలం 30 సీట్లు మాత్రమే. కర్ణాటకలో బీజేపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో 84 స్థానాలు ఉండగా వాటిలో ఒక్క చోట కూడా గెలవలేదు.