తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా? మరో రెండు, మూడ్రోజుల్లో..
దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణ నాటికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
Assembly Speaker Gaddam Prasad (Image Credit To Original Source)
- ముగియనున్న సుప్రీంకోర్టు గడువు
- విచారణకు రావాలని దానంకు స్పీకర్ నోటీసులు
- పూర్తైన సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్..
MLAs Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంటుంది. ఫిరాయింపు ఆరోపణలు ఫేస్ చేస్తున్న పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావ్, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు పార్టీ మారారు అనడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
మరో ముగ్గురు ఎమ్మెల్యేలు..సంజయ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే దానం నాగేందర్‌కు నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఈ నెల 30న క్రాస్ ఎగ్జామినేషన్‌కు అటెండ్ కావాలని ఆదేశించారు.
అయితే జనవరి 30తోనే సుప్రీంకోర్టు పెట్టిన గడువు ముగియనుంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. ఆయన ఎపిసోడ్లో స్పీకర్ నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది. కడియం శ్రీహరిని స్పీకర్ ఇప్పటివరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు.
Also Read: Nara Lokesh: అలాంటి వారికే గుర్తింపు అంటున్న నారా లోకేశ్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో ఇప్పటికే విచారణ పూర్తైన నేపథ్యంలో మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే క్లీన్ చిట్ ఇస్తారని చర్చ జరుగుతోంది. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు ఆలస్యంగా లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని కడియం శ్రీహరి స్పీకర్‌కు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకొస్తున్నారు కడియం. అయితే తన కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నామినేషన్ పత్రంలో కడియం సంతకం పెట్టారనే ప్రచారం ఉంది. ఈ అంశాన్నే స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. కడియం కేసులో విచారణ ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఒక తండ్రిగా కూతురు నామినేషన్ పత్రంపై సంతకం చేశానని కడియం కవర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం విషయంలో స్పీకర్ నిర్ణయం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
దానం నాగేందర్‌ది ప్రత్యేక కేసు
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్‌ది ప్రత్యేక కేసు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్‌పై ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఫిరాయింపు కేసులో ఈ అంశం కీలక ఆధారంగా మారింది. స్పీకర్ నోటీసులకు దానం నాగేందర్ ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. కాకపోతే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు.
అయితే ఇంతలోనే సుప్రీంకోర్టు గడువు ముంచుకొస్తుండటంతో..స్పీకర్ దాన నాగేందర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలని చెప్పారు. మరోవైపు తాను కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు దానం పలుమార్లు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు.
అయితే స్పీకర్ ముందు విచారణకు హాజరైనప్పుడు కూడా దానం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారా? లేక అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు మిగతా ఎమ్మెల్యేల్లాగా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్తారా.? అనేది సస్పెన్స్‌గా మారింది. దానం మాత్రం కాంగ్రెస్‌లో ఉన్నానని చెప్పే అవకాశముందట. ఇదే జరిగితే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశముంది. పైగా స్పీకర్ అనర్హత వేటు వేసే కంటే ముందే రాజీనామా చేయాలని దానం నాగేందర్ డిసైడ్ అయినట్లు సమాచారం.
డెడ్‌లైన్.. మరో రెండు/మూడ్రోజులే
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు పెట్టిన డెడ్‌లైన్ మరో రెండు/మూడ్రోజుల్లోనే ముగియనుంది. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణ నాటికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ పూర్తైంది కాబట్టి..ఆయనకు ఆల్మోస్ట్ క్లీన్ చిట్ ఇస్తారని అంటున్నారు.
ఇక కడియం ఎపిసోడ్ ఇంకా సస్పెన్స్‌లో ఉంది. ఆయన స్పీకర్ నోటీసులకు రిప్లై ఇచ్చారు. కానీ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి కాలేదు. దీంతో కడియం విషయంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. నోటీసుకు ఇచ్చిన రిప్లైని పరిగణలోకి కడియంకు క్లీన్ చిట్ ఇస్తారా.? లేక ఆయనను కూడా విచారణకు పిలుస్తారా.? అనేది ఎటూ తేలడం లేదు.
అయితే సుప్రీంకోర్టు గడవులోగా..కడియం, సంజయ్‌కు క్లీన్ చిట్ ఇస్తారని..దానం నాగేందర్ విచారణ కోసం మరింత సమయం కావాలని స్పీకర్..సుప్రీంకోర్టును గడువు కోరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండ్రోజుల్లో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది స్పష్టత రానుంది.
