Justice Naveen Rao: ఎంతో అనుభవాన్ని ఇచ్చింది.. మరింత మెరుగుపడాలి: తెలుగులో తీర్పుపై జస్టిస్ నవీన్ రావు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఇవాళ అభినందన సభ నిర్వహించారు.

Justice Naveen Rao: ఎంతో అనుభవాన్ని ఇచ్చింది.. మరింత మెరుగుపడాలి: తెలుగులో తీర్పుపై జస్టిస్ నవీన్ రావు

Telangana High Court

Updated On : July 9, 2023 / 7:30 PM IST

Justice Naveen Rao – TS High Court: తెలంగాణ (Telangana) హైకోర్టు చరిత్రలో మొట్టమొదటిసారి జూన్ 30న తెలుగులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు తెలుగులో తీర్పు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం 44 పేజీలతో ఆ తీర్పు వెలువరించింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావుకు విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఇవాళ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ (Mandali Buddha Prasad) సహా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ రావు మాట్లాడుతూ… న్యాయస్థానాల్లో తెలుగులో మాట్లాడిన వారిని ఇప్పటికీ చిన్న చూపుతూ చూస్తున్నారని చెప్పారు. ఉత్తరాదిన హిందీ విషయంలో మాత్రం ఈ పరిస్థితి లేదని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో తీర్పు కోసం సుప్రీంకోర్టు ఓ సాఫ్ట్ వేర్ ఇచ్చిందని తెలిపారు.

ఇందుకోసం ఓ కమిటీని నియమించారని వివరించారు. తెలుగులో తీర్పు ఇచ్చి, సాఫ్ట్ వేర్ తో ప్రయోగం చేసినట్లయిందని, ఇది ఎంతో అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో ప్రజలకు అర్థం అయ్యేలా తీర్పులు అందించాలని అన్నారు. ఇటీవల ఇలాగే ఇచ్చిన తీర్పుపై తాను అంతగా సంతృప్తి చెందలేదని, ఇది మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువరించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. భాష అనేది ప్రజలు, పాలకుల మధ్య అంతరాన్ని సృష్టించిందని ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పారు. రాజకీయ నేతలు ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగులో మాట్లాడుతారని, ఆ తరువాత ఇంగ్టిష్ లో మాట్లాడుతారని, దీన్ని తాను ఓ మంత్రి ముందే తప్పుబట్టానని తెలిపారు. భాష పెద్ద అంతరాన్ని సృష్టించిందని చెప్పారు.

Kajol : రాజకీయ నాయకుల పై కాజోల్‌ వ్యాఖ్యలు వివాదం అవ్వడంతో.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..