అరుణ‌మ్మ గెలిచి కేంద్ర‌మంత్రి కాబోతున్నారు: అన్నమలై

K Annamalai: అరుణ కోసం ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారని గుర్తుచేశారు.

అరుణ‌మ్మ గెలిచి కేంద్ర‌మంత్రి కాబోతున్నారు: అన్నమలై

Annamalai

Updated On : May 11, 2024 / 3:12 PM IST

డీకే అరుణమ్మ ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్‌కు పంపిస్తారని ఆశిస్తున్నానని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై అన్నారు. మహ‌బూబ్ న‌గ‌ర్‌ లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో అన్నమలై మాట్లాడారు. అరుణ‌మ్మ గెలిచి కేంద్ర‌మంత్రి కూడా కాబోతున్నారని చెప్పారు.

అరుణ కోసం ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారని గుర్తుచేశారు. పాల‌మూరు గళాన్ని పార్ల‌మెంటుకు తీసుకెళ్ల‌డానికే మోదీ ఇక్కడకు వచ్చారని చెప్పారు. పాల‌మూరు ప్రజల సమస్యలను కేంద్ర ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్లే ద‌మ్ము ధైర్యం ఉన్న నాయ‌కురాలు అరుణ‌మ్మ‌ అని అన్నారు.

ఆమెను గెలిపిస్తే పాల‌మూరు ప్రాంత రూపురేఖలన్నీ మారిపోతాయని తెలిపారు. అప్పట్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అరుణ ఈ ప్రాంతంలోకి ఏం చేశారో అందరికీ తెలుసని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కోసం 11 రోజులు పాదయాత్ర చేసిన చరిత్ర అరుణ‌మ్మ‌దని అన్నారు.

అరుణమ్మకు ఈ ప్రాంత ఆడ‌బిడ్డ‌గా ఈ పాల‌మూరు ప్ర‌జ‌ల‌తో వీడ‌దీలేని అనుబంధం ఉందని చెప్పారు. అటువంటి అరుణమ్మపై ఈ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, అస‌భ్య‌క‌రమైన దూష‌ణ‌లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పాలమూరు ఆడబిడ్డలంతా ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.

Also Read: దేశం నుంచి ముస్లింలను వెళ్లగొట్టాలని బీజేపీ కుట్ర చేస్తుంది : వి. హన్మంతరావు