KA Paul: తెలంగాణలో రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలవుతోంది: కేఏ పాల్

పదవులు శాశ్వతం కాదని, రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేఏ పాల్ అన్నారు.

KA Paul: తెలంగాణలో రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలవుతోంది: కేఏ పాల్

KA Paul

Updated On : December 23, 2024 / 4:54 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అన్నారు. 422 భవనాలను అక్రమంగా కూల్చివేశారని, ఆయన తమ్ముడి బిల్డింగ్‌ను ఎందుకు కూల్చలేదని ప్రశ్నించారు.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, గత బీఅర్ఎస్ ప్రభుత్వాలవి పచ్చి అబద్ధాలేనని తెలిపారు. రెండు ప్రభుత్వాల్లో సర్పంచులు అప్పుల పాలయ్యారని చెప్పారు. తన మద్దతుతోనే రేవంత్ సీఎం అయ్యారని, తనను వాడుకుని వదిలేశారని చెప్పుకొచ్చారు.

పదవులు శాశ్వతం కాదని, రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కేఏ పాల్ అన్నారు. గ్రామపాలన కోసం తన పర్యటనలు జరుగుతాయని, మే10 లోపు 100 గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. మరో రెండేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలు ఖాయమని జోస్యం చెప్పారు.

కాగా, హైదరాబాద్‌లో హైడ్రా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. కూల్చివేతలపై తాము ఎటువంటి యూటర్న్ తీసుకోలేదని చెప్పారు. సర్కారు పాలసీ ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అనుమతులు ఉన్న ఇళ్లను కూల్చబోమని అన్నారు.

విడాకుల కోసం కోర్టుకు సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌ భార్య అస్మా.. ఎందుకో తెలుసా?