KA Paul: ఎమ్మెల్సీ కవితపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు

ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే వంద రోజుల్లో గ్రామాల్లో అబివృద్ధి జరుగుతుందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.

KA Paul: ఎమ్మెల్సీ కవితపై కేఏ పాల్ తీవ్ర విమర్శలు

KA Paul

Updated On : December 30, 2024 / 5:18 PM IST

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కొత్త వేషం కట్టారని, బీసీ నినాదాన్ని అందుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ నిజామాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

“కవితకు పాల్ భయం పట్టుకుంది.. బీసీలు కవిత మాయలో పడొద్దు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల స్కామ్ జరిగింది. బంగారు తెలంగాణ అంటూ అప్పుల తెలంగాణగా మార్చారు” అని కేఏ పాల్ విమర్శించారు.

ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపిస్తే వంద రోజుల్లో గ్రామాల్లో అబివృద్ధి జరుగుతుందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని, ఒక్క బీసీ నేతనైనా ముఖ్యమంత్రిని చేశారా అని నిలదీశారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గా వాడుకుంటోందని తెలిపారు.

Chandrababu Naidu: ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదిక పంపిస్తున్నాం: చంద్రబాబు