Chandrababu Naidu: ప్రధాని మోదీకి ఈ ప్రాజెక్టు నివేదిక పంపిస్తున్నాం: చంద్రబాబు
బనకచర్లకు నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తి అవుతుందని తెలిపారు.

N Chandrababu Naidu
డబ్బు ఉంటే మూడేళ్లలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రాజెక్టుపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడామని అన్నారు. హైబ్రిడ్ మోడల్‌లో నిధుల సమీకరణకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ అని చెప్పారు. బనకచర్లకు నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తి అవుతుందని తెలిపారు.
ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రణాళికతో నీటిని స్టోరేజ్ చేశామని, ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 74 శాతం నీళ్లు ఉన్నాయని అన్నారు. జనవరి నెలలో ఇంత నీరు ఉండటం ఒక చరిత్ర అని తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో, నీటి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.
చరిత్ర చూసుకుంటే, టీడీపీ ప్రభుత్వంలోనే నీటి భద్రతకు అడుగులు పడ్డాయని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు గంగతో అన్న ఎన్టీఆర్ రాయలసీమని ఆదుకున్నారని తెలిపారు. సాగునీరు అందిస్తే, రాయలసీమ రతనాలసీమ అవుతుందని అన్నారు.
గోదావరి, బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే తెలుగుతల్లికి జలహారతి ఇచ్చినట్లేనని చంద్రబాబు నాయుడు తెలిపారు. బనకచర్లకు నీటిని తీసుకెళ్లగలిగితే నదుల అనుసంధానం పూర్తయినట్లేనని అన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రిజర్వాయర్ల అనుసంధానమూ పూర్తవుతుందని తెలిపారు.
Pawan Kalyan: అందుకే నాగబాబుకు క్యాబినెట్‌లో అవకాశం దక్కింది: పవన్ కల్యాణ్