ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవిత పిటిషన్‌పై వాదనలు ఎలా జరిగాయో తెలుసా?

ఆమె మొత్తం 11 మొబైల్ ఫోన్లలో డేటాను ధ్వంసం చేశారని ఈడీ వివరించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవిత పిటిషన్‌పై వాదనలు ఎలా జరిగాయో తెలుసా?

Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ కొనసాగుతుంది. కవిత తరఫు న్యాయవాదుల వాదనలు ఇవాళ ముగిశాయి. ఈడీ వాదనలు మంగళవారం కొనసాగుతాయి.

అభిషేక్ మను సింఘ్వి కవిత తరఫు వాదనలు వినిపిస్తూ.. అధికారుల విచారణకు సహకరిస్తున్న కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై ఇప్పటికే స్టేట్మెంట్లు ఇచ్చారని, కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.

మొదట అనుమానితురాలిగా కూడా ఉండని కవితను ఇప్పుడు నిందితురాలిగా మార్చారని చెప్పారు. గత నెల 15న కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. కవిత, కేజ్రీవాల్‌ను కలిపి విచారించడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విఫలమైందని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి బుచ్చిబాబు అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాకే ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిపారు. శరత్ రెడ్డితో పాటు రాఘవ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిందని అన్నారు.

ఈడీ వాదనలు వినిపిస్తూ.. కవిత ఫోన్లను ఉద్దేశపూర్వకంగానే ఫార్మాట్ చేశారని తెలిపింది. ఆమె మొత్తం 11 మొబైల్ ఫోన్లలో డేటాను ధ్వంసం చేశారని వివరించింది. ఈడీ మంగళవారం తమ వాదనలు కొనసాగించనుంది.

Also Read: మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి