Kalvakuntla Kavitha: నిజామాబాద్ సభలో కవిత తీవ్ర భావోద్వేగం.. వేదికపైనే కంటతడి.. అసలేం జరిగిందంటే?
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షరాలు కవిత(Kalvakuntla Kavitha) నిజామాబాద్లో నిర్వహించిన పాంచజన్యం బహిరంగ సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
Kalvakuntla kavitha gets emotional at nizamabad meeting
- నిజామాబాద్ సభలో కవిత కంటతడి
- అక్రమ కేసులతో వేధించారని ఆవేదన
- కాళేశ్వరం నీటి పంపిణీపై ప్రశ్నలు
Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షరాలు కవిత నిజామాబాద్లో నిర్వహించిన పాంచజన్యం బహిరంగ సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజల సమక్షంలో ప్రసంగిస్తున్న సమయంలో ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక సవాళ్లు, పడిన మానసిక వేదనను ఈ సభ వేదికగా ప్రజలతో పంచుకోవడంతో అక్కడున్న శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అక్రమ కేసులు పెట్టి వేధించారు:
ఏ తప్పూ చేయకపోయినా రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనను తీహార్ జైలుకు పంపారని కవిత(Kalvakuntla Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను ఉపయోగించి తీవ్రంగా వేధించారని ఆరోపించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా నిజామాబాద్ ప్రజల సంక్షేమం, తెలంగాణ హక్కుల పోరాటం కోసం వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశ్నల వర్షం:
ఇదే వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినప్పటికీ, నిజామాబాద్ జిల్లాలో కనీసం ఒక్క ఎకరానికైనా కొత్తగా సాగునీరు అందిందా అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారే తప్ప, స్థానిక రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదని ఆమె సభముఖంగా విమర్శించారు.
