Karnataka Elections 2023 : జేడీఎస్‌తో కలిసి కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్లు : రేవంత్ రెడ్డి
కుమారస్వామి సింగపూర్ లో ఉండి ప్లాన్లు వేస్తే..కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించటానికి ప్లాన్లు వేశారు. అయినా కర్ణాటకలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే.

Revanth Reddy, Kumara swamy, KCr
Karnataka Elections 2023 : బీజేపీ, బీఆర్ఎస్ లు బయట విమర్శలు చేసుకుంటాయి..కానీ రెండు ఒక్కటే అంటూ తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కర్ణాటక ఎన్నికల్లో రుజువైందని..బీజేపీని గెలిపించటానికి కేసీఆర్ పనిచేశారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. జేడీఎస్ తో కలిసి కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ప్లాన్లు వేశారని కానీ ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా..ఎన్ని కుట్రలు చేసినా కర్ణాటలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని అన్నారు. కుమారస్వామి సింగపూర్ లో ఉండి ప్లాన్లు వేస్తే..కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గెలిపించటానికి ప్లాన్లు వేశారని ఆరోపించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేసిన రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అస్తే తెలంగాణలో కూడా కాంగ్రెస్ దే అధికారం అని జేడీఎస్ తో కలిసి బీజేపీ, కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిన కన్నడ ప్రజలు కాంగ్రెస్ నే గెలిపిస్తారని ఈ విషయం మరో కొన్ని గంటల్లో తేలిపోతుందని ధీమా వ్యక్తంచేశారు. కర్ణాటకలో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకంటే ఎంఐఎం బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి పోటీ చేయలేదని..కాంగ్రెస్ ను ఓడించటానికి ఇన్ని పార్టీలు పనిచేస్తున్నాయంటే కాంగ్రెస్ ఎంత బలమైనదో అర్థం చేసుకోవాలని అంత బలమైన పార్టీ గెలుపు ఖాయం అని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రస్సే అని అప్పుడు ఈ పార్టీలన్నీ తెల్లముఖం వేయాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి..
Karnataka Elections 2023: ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకున్నాం: జేడీఎస్
కాగా.. మే 10న కర్ణాటక ఎన్నికల పోలింగ్ అవ్వగా…రేపు అంటే మే 13న లెక్కింపు జరుగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ దే గెలుపు అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడయ్యాయి. కానీ అవి కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే అని బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం అంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. అంచనాలు తల్లకిందులు కావటం ఖాయం ఎందుకైనా మంచిది కాంగ్రెస్ నేతలు అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోండి అంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయ సెటైర్లు వేశారు.
మరోపక్క తామే అధికారంలోకి వస్తామని జేడీఎస్ ధీమా వ్యక్తంచేస్తోంది. కానీ అంచనాలు తారుమారు అయి కర్ణాటకలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి, ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఓ పార్టీ జేడీఎస్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ షాకింగ్ విషయాలు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నుంచి సంప్రదింపులు మొదలయ్యాయని..ఏ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విషయంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
Karnataka Elections 2023 : కాంగ్రెస్ నేతలు అంబులెన్సులు దగ్గర ఉంచుకుంటే బెటర్ : బీజేపీ నేత సెటైర్లు
కాగా..20 ఏళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. ప్రతిసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అత్యధిక ఓట్లు సంపాదిస్తూ వస్తోంది. అయినప్పటికీ కేవలం రెండుసార్లు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి ఈ పరిస్థితి మారి ఈసారి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.