దీని గురించే చర్చించాను.. దీని కథ ఏంటో చాలా మందికి తెలియదు: కేసీఆర్ సంచలనం

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎల్పీ విస్తృతస్థాయి సమావేశం ముగిశాక కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

దీని గురించే చర్చించాను.. దీని కథ ఏంటో చాలా మందికి తెలియదు: కేసీఆర్ సంచలనం

KCR

Updated On : December 21, 2025 / 6:19 PM IST

KCR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని గురించి పార్టీ నేతలతో చర్చించానని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్యవర్గం, ఎల్పీ విస్తృతస్థాయి సమావేశం ముగిశాక కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.

“దీని కథ ఏంటో చాలా మంది తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివక్షకు గురైన జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. 174 టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉంది. 50 ఏళ్లు పాటించిన కాంగ్రెస్‌, 20 ఏళ్లు పాలించిన టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. ఆ జిల్లాలో కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. గతంలో పాలమూరును కోలుకోలేని దెబ్బకొట్టిన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ.

బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు చాలా వాదించాం. పాలమూరుకు జరిగిన అన్యాయాన్ని మేము వివరించాం. రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరిస్తామని ట్రైబ్యునల్ తెలిపింది. బచావన్ ట్రైబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారు.

పాలమూరు కోసం గంటెడు నీరు అడిగినోళ్లు కూడా అప్పుడు లేరు. 1974లో బచావత్ ట్రైబ్యులన్‌ 17 టీఎంసీల నీటిని జూరాలకు సుమోటోగా కేటాయించింది” అని కేసీఆర్ అన్నారు.