KA Paul: కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. చివరి నిమిషంలో ఉరిశిక్ష ఎలా ఆగింది? కేఏ పాల్ చేసిందేమిటి? ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు..

కేంద్రం చేతులెత్తేస్తే కేఏ పాల్ చక్రం తిప్పారా? బాధిత కుటుంబానికి రూ.11 కోట్లు బ్లడ్ మనీ ఇచ్చేదెవరు?

KA Paul: కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. చివరి నిమిషంలో ఉరిశిక్ష ఎలా ఆగింది? కేఏ పాల్ చేసిందేమిటి? ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు..

Updated On : July 16, 2025 / 10:25 PM IST

KA Paul: కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. యెమన్ దేశం ఆమెకు మరణ శిక్ష విధించింది. చివరి నిమిషంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేసింది. అయితే, ఈ వ్యవహారంలో తాము చేయాల్సింది అంతా చేశామని, ఇక తాము ఏమీ చేయలేము అని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. అప్పుడే ఎంటర్ అయ్యారు ప్రపంచ శాంతి దూతగా పేరున్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్.

Also Read: పాకిస్థాన్‌లో రామాయణం.. రాముడు, సీత, లక్ష్మణుడు అంతా పాక్ పౌరులే.. నాటక బృందంపై ప్రశంసల వర్షం..

తన వల్లే నిమిష ప్రియ ఉరిశిక్ష ఆగిందని కేఏ పాల్ ప్రకటించుకున్నారు. అసలు కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఎలా ఆగింది? చివరి నిమిషంలో కేఏ పాల్ చేసిందేమిటి? కేంద్రం చేతులెత్తేస్తే కేఏ పాల్ చక్రం తిప్పారా? బాధిత కుటుంబానికి రూ.11 కోట్లు బ్లడ్ మనీ ఇచ్చేదెవరు? ఇంతకూ ఇప్పుడు కేఏ పాల్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? నర్స్ నిమిష ప్రియ ఉరిశిక్షపై KA పాల్‌తో 10TV లైవ్ షో..