హైడ్రాకు విస్తృత అధికారాలు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు

మూడు యూనివర్సిటీల పేర్ల మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

హైడ్రాకు విస్తృత అధికారాలు.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు

Updated On : September 20, 2024 / 9:52 PM IST

Telangana Cabinet Decisions : తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు జరిగాయి. హైడ్రాకు చట్టబద్ధతపై క్యాబినెట్ భేటీలో చర్చ జరిగింది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మూడు యూనివర్సిటీల పేర్ల మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోఠి మహిళా కాలేజీని చాకలి ఐలమ్మ కాలేజీగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్ లూమ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకు కూడా వర్తిస్తుందన్నారు. దీనికి సంబంధించి నిబంధనలను సడలించామన్నారు. అవసరమైన 150 మంది అధికారులను, 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్ పై రప్పిస్తున్నామన్నారు.

మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ”హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారాలు కల్పించాం.

Also Read : బీఆర్‌ఎస్‌ భవనాలను కూల్చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తారా?

ఓఆర్ఆర్ కు లోపల చెరువులు, నాలాల కబ్జాల కట్టడికి హైడ్రాకు అధికారాలు. హైడ్రాకు.. 150 మంది అధికారులను, 946 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అలాట్ చేస్తూ నిర్ణయం. మూడు యూనివర్సిటీల పేర్లు మార్పుకు కేబినెట్ ఆమోదం. చాకలి ఐలమ్మ ఉమెన్స్ కాలేజ్, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్శిటీ, హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 60 మంది విద్యార్థులతో హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభించాం” అని మంత్రి పొంగులేటి తెలిపారు.

సెప్టెంబర్ 2027 వరకు ఎస్ఎల్ బీసీ పనులు పూర్తి చేస్తాం- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
SLBC టన్నెల్ వర్క్స్ 4,637 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చాం. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులను పూర్తిచేస్తాం. సెప్టెంబర్ 2027 వరకు పూర్తి చేస్తాం. SLBC టన్నెల్ చరిత్రాత్మకం కానుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణ వాటర్ తీసుకునే అవకాశం ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండింగ్ పనులను తొందరగా పూర్తి చేస్తాం. ప్రతి నెల 400 మీటర్లు టన్నెల్ వర్క్స్ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. సన్న వడ్లకు రూ.500 బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి నుండి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తాం.

నాకు, కాంగ్రెస్ కు పేరు వస్తుందని కేసీఆర్ భయపడ్డారు- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎస్ ఎల్ బీసీపై గతంలో కేసీఆర్ వ్యంగంగా మాట్లాడారు. నిర్లక్ష్యం చేశారు. రెండు పంటలకు కాలువ ద్వారా slbc నీల్లొస్తాయి. నాకు, కాంగ్రెస్ కు.. ఎక్కడ పేరు వస్తుందో.. అని కేసీఆర్ slbcని పూర్తి చేయలేదు. ఎస్ ఎల్ బీసీతో నల్గొండ జిల్లాకు పూర్తిగా ఫ్లోరైడ్ దూరం అవుతుంది.