Singer Mangli Birthday Party: భారీగా విదేశీ మద్యం, మత్తులో మహిళలు, పెద్దఎత్తున శబ్దాలు.. మంగ్లీ బర్త్ డే పార్టీ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు

డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్దాలు వాడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మంగ్లీ ఫోటో, పార్టీకి సంబంధించిన ఇతర ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Singer Mangli Birthday Party: భారీగా విదేశీ మద్యం, మత్తులో మహిళలు, పెద్దఎత్తున శబ్దాలు.. మంగ్లీ బర్త్ డే పార్టీ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు

Updated On : June 11, 2025 / 6:01 PM IST

Singer Mangli Birthday Party: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ కేసు ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. చేవేళ్ల ఎస్ఐ శిరీష రాత్రి 12 గంటల 45 నిమిషాలకు పెట్రోలింగ్ చేస్తుండగా ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్ నుంచి పెద్దఎత్తున శబ్దాలు వినిపించాయి. దీంతో ఆమె సిబ్బందితో కలిసి రిసార్ట్ లో దాడులు చేశారు. ఆ సమయంలో 10 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించారు.

అయితే బర్త్ డే పార్టీ, లిక్కర్, డీజేకి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వారిపై కేసు నమోదు చేశారు. అలాగే అనుమానంతో డ్రగ్ కిట్లతో అందరికీ టెస్టులు చేయగా ఒకరికి (దామోదర్) గంజాయి పాజిటివ్ గా వచ్చింది. దీంతో అతడిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై దాడి చేశామని తెలిపారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా ఉంటామంటే కుదరదని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్దాలు వాడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మంగ్లీ ఫోటో, పార్టీకి సంబంధించిన ఇతర ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: హనీమూన్ కేసులో సంచలనం.. నేనే చంపించాను, నేరాన్ని అంగీకరించిన సోనమ్..! సోనమ్‌ను ఉరి తీయాలన్న సోదరుడు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్ లో తన బర్త్ డే పార్టీ ఇచ్చారు ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ. ఈ పార్టీలో మంగ్లీ కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్లు మొత్తం 48 హాజరయ్యారు. బర్త్ డే పార్టీ సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు అర్థరాత్రి త్రిపుర రిసార్ట్ పై దాడి చేశారు. పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యం భారీగా పట్టుబడింది. పార్టీలో పాల్గొన్న వారందరికీ గంజాయి టెస్టులు నిర్వహించారు. మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. సింగర్ మంగ్లీపై చేవెళ్ల పీఎస్ లో కేసు నమోదైంది. మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామక్రిష్ణపైనా కేసు నమోదు చేశారు.

మంగ్లీ బర్త్ డే పార్టీ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు..
”రాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు వచ్చింది. రిసార్ట్ లో పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ హంగామా చేస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. రిసార్ట్ లో పెద్దఎత్తున డీజే పెట్టారంటూ కంట్రోల్ రూమ్ కి స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల ఫిర్యాదుతో త్రిపుర రిసార్ట్ కి వెళ్లారు మహిళా ఎస్ఐ. 10 మంది మహిళలు, 12మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించాం. అందరూ మద్యం మత్తులో ఉండి డ్యాన్సులు చేస్తున్నట్లు గుర్తించాం.

మంగ్లీ బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లుగా అక్కడ ఉన్న మేనేజర్ చెప్పాడు. బర్త్ డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని మేనేజర్ తెలిపాడు. పార్టీలో పెద్దఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించాం. ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని గుర్తించాము. బర్త్ డే పార్టీ చేసుకుంటున్న మంగ్లీని విచారించాం. బర్త్ డే పార్టీ, లిక్కర్, డీజేకి అనుమతి లేదని చెప్పారు. డీజేను ఈవెంట్ మేనేజర్ మేఘరాజు చేసినట్లుగా గుర్తించాం.

పార్టీలో పాల్గొన్న పురుషులు మహిళలు అందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించాము. డ్రగ్ కిట్ ద్వారా అందరినీ పరీక్షిస్తే ఒకరికి గంజాయి తీసుకున్నట్లు తేలింది.
మంగ్లీ అనుచరుడిగా ఉన్న దామోదర్ రెడ్డి గంజాయి తాగినట్లు గుర్తించాం. దామోదర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించి పంపేశాం. పార్టీలో పెద్దఎత్తున విదేశీ మద్యాన్ని గుర్తించాం. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించిన మంగ్లీ సోదరుడు శివరామకృష్ణపై కేసు నమోదు చేశాం.

పోలీసులు, ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీ ఏర్పాటు చేసినందుకు మంగ్లీపైన కేసు నమోదు చేశాం. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీకి అనుమతి ఇచ్చిన త్రిపుర రిసార్ట్ మేనేజర్ పైనా కేసు పెట్టాం. ఈవెంట్ ఆర్గనైజర్ మేఘరాజ్ పైనా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం” అని పోలీసులు తెలిపారు.