ఈ సారి విశ్వ శాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు… ప్రత్యేకతలు ఏంటంటే?

ఈ విగ్రహ నిర్మాణం కోసం 150 మంది కళాకారులు శ్రమిస్తున్నారని అన్నారు.

ఈ సారి విశ్వ శాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు… ప్రత్యేకతలు ఏంటంటే?

Updated On : June 6, 2025 / 5:17 PM IST

ప్రముఖ శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ నిర్మాణం కొనసాగనుంది. 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు ఈసారి కూడా వైభవంగా, విశిష్టంగా జరగనున్నాయి.

గణేశుడి విగ్రహ తయారీ పనులు ఇవాళ కర్ర పూజతో ప్రారంభమయ్యాయి. వరుసగా 71వ ఏడాది మహా గణపతిని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ సందర్భంగా శిల్పి రాజేంద్రన్ 10టీవీతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు.

ఈ ఏడాది ప్రపంచ శాంతికి, భారతదేశ సమగ్రత కోసం ప్రత్యేకంగా శ్రీ విశ్వ శాంతి మహా శక్తి గణపతి రూపంలో గణేశుడిని రూపుదిద్దుతున్నారు. 69 అడుగుల ఎత్తులో గణపతి విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ఈ విగ్రహ నిర్మాణం కోసం 150 మంది కళాకారులు శ్రమిస్తున్నారని అన్నారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ సారి మట్టితో విగ్రహాన్ని నిర్మిస్తున్నామన్నారు. అలాగే, సహజసిద్ధమైన రంగులు మాత్రమే వాడుతున్నట్లు తెలిపారు.

ఉత్సవాలకు వారం రోజుల ముందే విగ్రహ నిర్మాణం పూర్తవుతుందని రాజేంద్రన్ తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి ఈ సారి శాంతి, ఐక్యతలకు ప్రతీకగా నిలవనున్నాడు.