Khairatabad Ganesh : పగిడీతో దర్శనమిస్తున్న మహాగణపయ్య

ఒక్కో సంవత్సరం ఒక్కో ఆహార్యంతో భక్తులను విశేషంగా ఆకట్టుకునే ఖైరతాబాద్‌ మహాగణనాథుడుకి కొత్త అందం చేకూరింది. తొలిసారిగా పగిడితో (తలకు పాగా) తో మరింత శోభాయమానంగా వెలిగిపోతున్నాడు.

Khairatabad Ganesh : పగిడీతో దర్శనమిస్తున్న మహాగణపయ్య

Khairatabad Maha Ganapathi Wears Turban (1)

Updated On : September 14, 2021 / 12:30 PM IST

Khairatabad Ganapathi Wears Turban : హైదరాబాద్‌లో వినాయక చవితి అంటే ఠక్కున గుర్తుకొచ్చే గణపయ్య ఖైరతాబాద్ మహా గననాథుడు. ఒక్కో సంవత్సరం ఒక్కో ఆహార్యంతో భక్తులను విశేషంగా ఆకట్టుకునే ఈ మహాగణనాథుడు ఈ ఏడాది కూడా కొత్త అవతారంతో వెలిగిపోతున్నాడు. భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఈ క్రమంలో ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి భక్తులకు సరికొత్తగా దర్శనమిస్తున్నాడు. తొలిసారిగి పగిడితో (తలకు పాగా) తో మరింత శోభాయమానంగా కనువిందు చేస్తున్నాడీ లంబోదరుడు.

మరి ఈ భారీ గణనాథుడికి పగిడి ధరింపజేయాలని ఎవరు అనుకున్నారంటే..హైదరాబాద్ నగర వ్యాప్తంగా వేలాది వినాయకుడులు కొలువుదీరి ఉన్నారు. పలు ప్రాంతాల్లో పలు అవతారాలతో వినాయకుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. అలా పలు ప్రాంతాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరులకు తలకు పగిడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రాకేష్ ముదిరాజ్, ముకేశ్ ముదిరాజ్‌.. మహాగణపతికి కూడా పగడి ఉంటే బాగుంటుందని అనుకున్నారు. పగిడితో మహానాయకుడు కొత్త అందంతో వెలిగిపోవాలనే భక్తిభావంతో తమ ఆలోచనను ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు.

వారు కూడా సంతోషంగా అంగీకరించేసరికి ..ఇక వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. అంతే బాహుబలి సినిమాలో పగడిలను రూపొందించిన చార్మినార్‌కు చెందిన బృందం వద్దకు వెళ్లి..ఖైరతాబాద్ మహాగణపతికి పగిడి తయారుచేయాలని కోరారు. దానికి వారు పగిడి తయారీకి కావాల్సిన మెటీరియల్‌తో ఖైరతాబాద్ చేరుకున్నారు.

మహాగణపతి ఆకారానికి సరిపడా పాగా తయారు చేయాలంటే ఎంత మెటీరియల్ పడుతుందో అంచనా వేశారు. అలా 14 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు ఉండే పగిడీని తయారు చేసి వినాయకుడికి అలంకరించారు. అలా ఈ సంవత్సరం పగిడితో వినాయకుడు మరింత అందంగా భక్తులకు దర్శమిస్తున్నాడు. పగిడి గణపయ్యను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. కాగా ఖైరతాబాద్ పంచముఖ గణనాథుడు ఈ సంవత్సరం 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. ఈ మహాగణపయ్యకు 1100 కిలోల భారీ లడ్డూతో అలరారుతున్నాడు.