Kishan Reddy : పొత్తులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పొత్తులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy : పొత్తులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy

Updated On : December 15, 2023 / 4:25 PM IST

BJP Kishan Reddy  : పొత్తులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఏ పార్టీతోను పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతు..బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికలు వెళుతుందనే వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలనే లక్ష్యంతో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి నేతలకు, కార్యకర్తలకు క్లారిటీ ఇస్తు..ఒంటిరిగానే పోటీకి వెళతామని తెలిపారు.

రేపటి నుంచి తెలంగాణలో వికసిత భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పోటీగా విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో సమానంగా పోరాటాలు చేస్తామని..దీంట్లో ఏమాత్రం సందేహంలేదన్నారు.