13నుంచి 15 వరకు పతంగుల, స్వీట్ ఫెస్టివల్ 

  • Published By: chvmurthy ,Published On : January 9, 2019 / 06:36 AM IST
13నుంచి 15 వరకు పతంగుల, స్వీట్ ఫెస్టివల్ 

హైదరాబాద్:  సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జనవరి 13నుంచి 15వరకు సికింద్రాబాద్, పేరేడ్ గ్రౌండ్స్ లో 4వ అంతర్జాతీయ పతంగుల పండుగ, స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి చెప్పారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన మంగళవారం ఉన్నతస్ధాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఖ్యాతి పెరిగేలా ఈ రెండు ఉత్సవాలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు 3లక్షలమంది సందర్శకులకు సరిపడా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. 20దేశాల నుంచి పతంగులు ఎగురవేసే నిపుణులు పాల్గోంటున్నారని, అలాగే స్వీట్ ఫెస్టివల్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు 1000 రకాయిల మిఠాయిలు తయారు చేసి ప్రదర్శిస్తారని సమావేశంలో  పాల్గోన్న టూరిజం శాఖ కార్యదర్శి బి.వెంకటేశం చెప్పారు.