ఏపీ ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Updated On : June 1, 2024 / 2:19 PM IST

Komatireddy Rajagopal Reddy: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైసీపీకి ఓటు వేశారా లేక మార్పు కోరుకుంటున్నారా అన్నది నాలుగో తేదీన తెలుస్తుందని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

తెలంగాణలో జరిగిన లోక్‌స‌భ‌ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా ఫైట్ జరిగిందన్నారు. బీజేపీ కన్నా రెండు స్థానాలు అధికంగా కాంగ్రెస్ గెల్చుకుంటుందని, మెజారిటీ పార్లమెంట్ స్థానాలు తమ పార్టీకే వస్తాయని దీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర. యూపీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నదని.. ఈసారి
ఎన్నికలు బీజేపీకి అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో భవిష్యత్తును నిర్ణయించే తీర్పు ప్రజలు ఇచ్చారని భావిస్తున్నట్టు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే బాల వీరంజనేయులు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంగోపాల్ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయ మూర్తులు బీవీఎల్ఎన్వి చక్రవర్తి, ఏవి శేష సాయి తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Also Read: పల్నాడు పేరు దేశం మొత్తం మార్మోగుతోంది- ఎస్పీ మలికా గార్గ్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు: అయ్యన్న
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకున్నట్టు చెప్పారు.

Also Read: ఎగ్జిట్ పోల్స్‌తో కూటమికి దిమ్మతిరడం ఖాయం, సంబరాలకు వైసీపీ శ్రేణులు సిద్దం.. మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్