Konda Susmita: నా టార్గెట్ రేవంత్ రెడ్డి.. పరకాల స్థానాన్ని వదిలేది లేదు.. మరోసారి కొండా సుస్మితా సంచలన కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా(Konda Susmita) పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
konda susmita remarks against cm revanth reddy
- రేవంత్‌పై సుస్మిత సంచలన వ్యాఖ్యలు
- ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సై
- తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ కలకలం
Konda Susmita: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా (Konda Susmita)పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని, ఆయన నిర్ణయాలను నేరుగా ప్రశ్నిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పార్టీ అధిష్ఠానం పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని చెబుతూనే, సీఎం సొంత నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల ఈ రాజకీయం మరింత వేడెక్కింది.
పరకాల సీటుపై తెగేసి చెప్పిన సుస్మిత:
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే మళ్లీ కాంగ్రెస్ టికెట్ ఇస్తామని సీఎం ప్రకటించడంపై సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని, పరకాల స్థానాన్ని వదిలేది లేదని ఆమె గట్టిగా స్పష్టం చేశారు.
అధిష్ఠానం వద్దకు చేరిన పంచాయితీ:
సొంత పార్టీ సీఎంపైనే మంత్రి కుమార్తె బహిరంగంగా విమర్శలు చేయడంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరుతూ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. దీంతో పరకాల టికెట్ పోరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద సవాలుగా మారింది.
