Mynampally Issue: సొంత పార్టీ ఎమ్మెల్యేపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు మైనంపల్లి తీరు ఉందని చింతా ప్రభాకర్ మండిపడ్డారు.

Mynampally Issue: సొంత పార్టీ ఎమ్మెల్యేపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Mynampally Issue

Mynampally Issue – BRS: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు(Harish Rao)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) చేసిన కామెంట్స్ పై పలువురు ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్, ఆందోల్ ఎమ్మెల్యేలు మాణిక్ రావ్, క్రాంతి కిరణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. హరీశ్ రావు గురించి మైనంపల్లి అలా మాట్లాడటం సరికాదని క్రాంతి కిరణ్ అన్నారు. ఒకే కుటుంబంలోని ఇద్దరికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. బీఆర్ఎస్ ఎదుగుతున్న సమయంలో ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. మైనంపల్లి తన తీరును మార్చుకోవాలని చెప్పారు.

మైనంపల్లిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ… మైనంపల్లి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు మైనంపల్లి తీరు ఉందని మండిపడ్డారు. హరీశ్ రావు ఎంతో శ్రమిస్తారని చెప్పారు. ఆయనను విమర్శించే స్థాయి మైనంపల్లికి లేదని అన్నారు.

కాగా, మైనంపల్లి తాజాగా మాట్లాడుతూ…రాజకీయంగా హరీశ్ చాలా మందిని అణిచివేశారని, ఆయనను అణిచివేసేది తానేనని హెచ్చరించారు. తనతో పాటు తన కుమారుడికి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవాళ కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో మైనంపల్లి పేరు ఉంది. మైనంపల్లి కుమారుడి పేరు లేదు.

Telangana Elections 2023: బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకోలేకపోయిన నేతల గురించి కేటీఆర్ ఏమన్నారో తెలుసా?