Krishna Express : సిబ్బంది అప్రమత్తతతో.. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

ఆలేరు స్టేషన్ కు చేరుకునే క్రమంలో రైలు కుదుపులకు గురైంది. భారీ శబ్దాలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Krishna Express : సిబ్బంది అప్రమత్తతతో.. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Krishna Express

Updated On : March 31, 2024 / 1:10 PM IST

Krishna Express Missed big Accident : యాదాద్రి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగిన విషయాన్నిముందే గుర్తించడంతో వెంటనే రైలును నిలిపివేశారు. పట్టాకు మరమ్మతులు చేసిన అనంతరం కృష్ణా ఎక్స్ ప్రెస్ తిరిగి బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కూతురు కావ్య

అదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు వెళ్తుండగా ఆలేరు స్టేషన్ కు చేరుకునే క్రమంలో రైలు కుదుపులకు గురైంది. భారీ శబ్దాలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది వచ్చి పరిశీలించగా.. మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల మేర రైలు పట్టా విరిగిపోయినట్లు గుర్తించారు. వెంటనే రైలు పట్టా విరిగిన ప్రాంతంలో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేశారు. మరమ్మతుల అనంతరం కృష్ణా ఎక్స్ ప్రెస్ బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులు, సిబ్బంది అప్రమత్తతో పెనుప్రమాదం తప్పినట్లయింది.