KRMB Key Meeting : తెలంగాణ నదీ జలాల వాటా పెంచండి- కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశంలో రాహుల్ బొజ్జా

బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి టెలీమెట్రిక్ విధానం, అదే విధంగా నీటి కేటాయింపులు, యాసంగి సీజన్ కి నీటి విడుదల అంశాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది.

KRMB Key Meeting : తెలంగాణ నదీ జలాల వాటా పెంచండి- కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశంలో రాహుల్ బొజ్జా

Updated On : January 21, 2025 / 10:52 PM IST

KRMB Key Meeting : కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ప్రధానంగా మూడు నాలుగు అంశాలపై చర్చించినట్లు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. కృష్ణా నదీ జలాల మళ్లింపుపై చర్చ జరిగినట్లు, తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు ఛైర్మన్ ఒప్పుకున్నారని వివరించారు. ఇటు నాగార్జున సాగర్ డ్యామ్ పర్యవేక్షణ నుంచి సీఆర్పీఎఫ్ ను విరమించుకోవాలని విన్నవించారు.

మంగళవారం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇటు తెలంగాణ, అటు ఏపీ నుంచి ముఖ్యమైన అధికారులు అంతా పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై డిస్కషన్ చేశారు. బోర్డుకు సంబంధించిన నిధుల కేటాయింపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి టెలీమెట్రిక్ విధానం, అదే విధంగా నీటి కేటాయింపులు, యాసంగి సీజన్ కి నీటి విడుదల అంశాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది.

Also Read : జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో బీఆర్ఎస్..

ప్రాజెక్టుల నిర్వహణ చాలా కీలకంగా ఉంది కాబట్టి ప్రాజెక్టుల మెయింటెన్స్ అంశాన్ని తెలంగాణ అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. వీటితో పాటు ముఖ్యంగా నీటి కేటాయింపులకు సంబంధించి మరోసారి బోర్డు దృష్టికి తెలంగాణ అధికారులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

క్యాచ్ మెంట్ ఏరియా, పరివాహక ప్రాంతం తెలంగాణలో 79శాతం వరకు ఉంటుంది కాబట్టి ఆ దిశగా కేటాయింపులు జరగాలి, కానీ, తెలంగాణ ఏర్పడిన కొత్తలో అంటే 2014లో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం వాటాలు మాత్రమే కేటాయించారు.

కాబట్టి వాటిని పున:సమీక్షించే వరకు కూడా బచావత్ ట్రిబునల్ నుంచి ఆదేశాలు వచ్చే వరకు కూడా ప్రస్తుతం ఉన్న వాటిలో నీటి కేటాయింపులకు సంబంధించి 50-50 అంటే తెలంగాణకు 50శాతం, ఏపీకి 50శాతం కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కృష్ణాలో 811 టీఎంసీలు ఉంటాయి. వీటిలో 50-50 శాతం షేర్ చేయాలని కోరారు.

 

Also Read : బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌గా ఈటల పేరు ఖరారు అయిందా? రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో రామ్‌మాధవ్‌ చక్రం తిప్పుతున్నారా?