KTR: జైల్లో పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు
పట్నం నరేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

KTR
చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పేద, గిరిజన, దళిత, బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈ రోజు నరేందర్ రెడ్డి జైలు పాలయ్యారని అన్నారు.
పట్నం నరేందర్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన తమతో ఒకే విషయాన్ని ప్రస్తావించారని, తన గురించి వదిలేయాలని, చేయని తప్పుకు జైల్లో ఉన్న 30 మంది రైతులను విడిపించాలని పట్నం నరేందర్ రెడ్డి కోరారని తెలిపారు.
గిరిజన దళిత రైతుల భూములను గుంజుకుంటున్నారని, వారికి అండగా నిలవండని కోరారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సంగారెడ్డి జైలు నుంచి మొదలుపెడితే చర్లపల్లి జైలు దాకా అమాయకులు జైల్లో ఉన్నారని తెలిపారు. భూములు ఇవ్వకపోతే అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి ఆడవాళ్లు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా అరాచకాలు చేస్తోంది ఈ ప్రభుత్వమని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి సొంత ఊర్లో నిన్న సాయి రెడ్డి అనే మాజీ సర్పంచ్ మృతి చెందారని అన్నారు. ఇంటిముందు దారి లేకుండా గోడలు కడితే మానసిక క్షోభకి గురై ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పేదవారి భూములను లాక్కుంటే ఊరుకోబోమని, పేదకు కేసీఆర్ అండగా ఉన్నారని తెలిపారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు ..