బండి సంజయ్ ఏం చదువుకున్నారు? ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుంది?: కేటీఆర్

బండి సంజయ్‌ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందని నిలదీశారు.

బండి సంజయ్ ఏం చదువుకున్నారు? ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుంది?: కేటీఆర్

KTR and Revanth Reddy

Updated On : October 19, 2024 / 4:27 PM IST

గ్రూప్ వన్ అభ్యర్థులను కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం దుర్మార్గమని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రూప్ వన్ అభ్యర్థులను ఈ సర్కారు పశువుల్లా చూస్తోందని చెప్పారు.

గ్రూప్ వన్ అభ్యర్థులు ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలని, కనీసం సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకైనా ప్రభుత్వం వేచి చూడాలని అన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కావాలనే డ్రామా ఆడుతున్నారని చెప్పారు. బండి సంజయ్ ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి ర్యాలీ చేయిస్తోంది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు.

తమ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్‌ను చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందని నిలదీశారు. బండి సంజయ్ ఏం చదువుకున్నారని, అసలు ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. పరీక్ష పత్రాలు లేక్ చేయమంటే ఆయన చేస్తారని, అభ్యర్థుల తరఫున ఆయనేం చర్చిస్తారని అన్నారు.

సెక్రటేరియట్‌కు భారీగా చేరుకున్న గ్రూప్ 1 అభ్యర్థులు.. ప్రధాన గేట్ ముందు వందలాది మంది అభ్యర్థుల బైఠాయింపు