తిరోగమన తెలంగాణ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుకు ఇది అద్దం పడుతోంది: కేటీఆర్

ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయని కేటీఆర్ అన్నారు.

తిరోగమన తెలంగాణ.. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుకు ఇది అద్దం పడుతోంది: కేటీఆర్

BRS Working President KTR

Updated On : December 15, 2024 / 2:56 PM IST

తెలంగాణ సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ అన్ని రంగాల్లోనూ వెనకబడుతోందని చెబుతూ ట్వీట్ చేశారు. “తిరోగమన తెలంగాణ! పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, అనుభవరాహిత్యం, అసమర్థత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో నేడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోంది.

రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ. ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయి. కానీ తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉంది.

మన పొరుగున ఉన్న అయిదు రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8% నుండి 32% వృద్ధిని నమోదు చేస్తే తెలంగాణ ఒక్కటే గత ఏడాది కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడం రాష్ట్రంలోని విఫల ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది.

పాలన గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయిస్తే ఫలితాలు ఇలా కాక మరెలా ఉంటాయి? ” అని కేటీఆర్ అన్నారు.