Revanth Reddy : కాంగ్రెస్ సునామిని చూసి కోట్ల రూపాయలతో కేటీఆర్ ఫేక్ ప్రచారాలు : రేవంత్ రెడ్డి
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం అన్నారు.

TPCC President Revanth Reddy (5)
Revanth Reddy – KTR : బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలారని కేటీఆర్ ను ఉద్ధేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగాడని ఆరోపించారు. ఈ మేరకు శనివారం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న వీళ్ళ మిత్ర పార్టీ బీజేపీ, 40శాతం కమీషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించిందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ 100 రోజుల్లోపే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు నడిపిస్తోందన్నారు.
Manikrao Thakre : బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు : మాణిక్ రావు ఠాక్రే
ఇప్పుడు తెలంగాణాలోనూ కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ వస్తుంది.. తెలంగాణ గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు.