Hyderabad IT : గుడ్ న్యూస్.. ఉప్పల్‌‌లో భారీ ఐటీ ప్రాజెక్టు, మంత్రి కేటీఆర్ భూమి పూజ

ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్ లో లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్...ఇతర ప్రాంతాలకు కూడా ఐటీ సంస్థలను విస్తరించే లక్ష్యంతో తాము పని చేయడం జరుగు

Hyderabad IT : గుడ్ న్యూస్.. ఉప్పల్‌‌లో భారీ ఐటీ ప్రాజెక్టు, మంత్రి కేటీఆర్ భూమి పూజ

Ktr

Updated On : February 13, 2022 / 12:33 PM IST

KTR Lay Foundation Stone For IT Campus : హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. అభివృద్ధిలో దూసుకపోతోంది. ఎంతో మందికి ఇక్కడకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి వచ్చేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫలితంగా వచ్చిన ఐటీ కంపెనీల ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతోంది. అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ నెలో నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అయితే.. హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు..నగరం నలుమూలాల విస్తరిస్తున్నాయి. తాజాగా.. ప్రముఖ ఐటీ కంపెనీ జెన్ ప్యాక్ట్ ఉప్పల్ లో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. అందులో భాగంగా… ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉప్పల్ క్యాంపస్ కు భూమి పూజ చేశారు. దీని ద్వారా 15 వేలకు పైగానే ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

Read More : R.Narayanamurthy : వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఉద్యమం ఉధృతం.. సినీ నటుడు ఆర్‌ నారాయణమూర్తి మద్దతు

ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్ లో లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని వ్యాఖ్యానించారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లడుతూ…వరంగల్ కు కూడా జెన్పాక్ట్ వస్తోందని, ఐటీ విస్తరించడం ద్వారా చాలా మందికి ఉపాధి దొరుకుతుందని..ఇందుకు ఆ సంస్థలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత IT అనేది హైదరాబాద్ లోని ఒక ప్రాంతానికే కాకుండా చాలా వేగంగా ఇతర ప్రాంతాల్లో విస్తరింప చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలకు కూడా ఐటీ సంస్థలను విస్తరించే లక్ష్యంతో తాము పని చేయడం జరుగుతోందన్నారు.

Read More : Delhi NCB : ఢిల్లీ డ్రగ్స్ కేసు.. హైదరాబాద్ వైద్యుడు అరెస్టు

తూర్పు ప్రాంతంలో జెన్పాక్ట్ సంస్థ 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నట్లుగా సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు భారీ ఫ్లైఓవర్ వేస్తున్నట్లు, ఇంకా 4, 5 మంది ప్రైవేటు డెవలపర్స్ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. వారికి కూడా అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. ఈ ప్రాంతంలో ఐటీ విస్తరించడం ద్వారా చాలా మందికి ఉపాధి దొరుకుతుందన్నారు మంత్రి కేటీఆర్.