KTR: గవర్నర్ తమిళిసైకి బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు మాత్రమే వినిపిస్తాయా?: కేటీఆర్
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నో మాట్లాడారని అన్నారు. వారి గురించి గవర్నర్ ఏమీ మాట్లాడడం లేదని చెప్పారు.

KTR
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు మాత్రమే వినిపిస్తాయా అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నో మాట్లాడారని అన్నారు. వారి గురించి గవర్నర్ ఏమీ మాట్లాడడం లేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అనేందుకు ఇది ఉదాహరణ కదా? అని అన్నారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్నారు.
తాము ఈ నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. ఫిబ్రవరి 10 లోపు అన్ని సమావేశాలు పూర్తి చేస్తామన్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలను యాక్టీవ్ చేస్తామని తెలిపారు.
కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత
కొత్త ప్రభుత్వంపై వేగంగా వ్యతిరేకత వస్తోందని కేటీఆర్ అన్నారు. కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు సహనం కూడా ఉండాలని, రైతు భరోసా అడిగితే చెప్పుతో కొడతామనడం సమంజసమా? అని కేటీఆర్ అడిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తాము గుర్తు చేస్తున్నామని చెప్పారు. కేఆర్ఎంబీ పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెడుతుందని అన్నారు.
ఇంకా ఏమన్నారు?
- ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై ఉద్యమిస్తాం
- పాలన ఢిల్లీ నుంచి ఉంటుందని మేము ముందుగానే చెప్పాము
- దావోస్ లో జరిగింది అంతా పెట్టుబడులపై ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం;
- బహుళ జాతి సంస్థలతో నష్టం అని చెప్పారు….ఎక్కడా సామాజిక న్యాయం ఉండదని అంటున్నారు
- రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ఉప ముఖ్యమంత్రి దాడి అని అనుకుంటా
- ప్రపంచీకరణకు తలుపులు తెరిసింది కాంగ్రెస్ కాదా?
- బెల్టు షాపులు ఎత్తి వేస్తాం అని అంటున్నారు… ఎలైట్ బార్ లు పెడతాం అంటున్నారు
- మంత్రుల మధ్య ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తున్నాయి
- సీఎం రేవంత్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి
- అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రకటనలు చేశారు
- మార్చి 17తో వంద రోజుల ప్రభుత్వానికి వంద రోజులు నిండుతాయి
- ఆరు గ్యారంటీలలో ఉన్న అన్ని హామీలు ఫిబ్రవరి రెండో వారం నాటికి మొదలు పెట్టాలి
- మహాలక్ష్మి, రైతు భరోసా లాంటి పథకాల పై వెంటనే ఆదేశాలు ఇవ్వండి
- తప్పించుకునే ప్రయత్నాలపై పట్టు బడుతాం
- ఎన్నికల కోడ్ మీద నెపం తో తపోయించుకునే యత్నాలు
- పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కలిసి పని చేస్తాయి
పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తొలిసారి పెద్దఎత్తున బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశం