తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా.. హైడ్రా బాధితులకు అండగా ఉంటాం : కేటీఆర్
హైడ్రా కూల్చివేతలతో మనోవేదనకు గురవుతున్నామని చెబుతూ పలువురు బాధితులు శనివారం తెలంగాణ భవన్ కు వచ్చారు.

KTR
KTR : హైడ్రా కూల్చివేతలతో మనోవేదనకు గురవుతున్నామని చెబుతూ పలువురు బాధితులు శనివారం తెలంగాణ భవన్ కు వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదని వారు వాపోయారు. అధికారులతో మాట్లాడినా కూడా స్పందన కరువైందని వాపోయారు. బీఆర్ఎస్ నేతలకు కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు వచ్చామని, ఎప్పుడు తమ నిర్మాణాలు కూలుస్తారోనని నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని పలువురు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కేటీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామనుకున్నారు. కానీ, హైడ్రా బాధితుల వద్దకు కేటీఆర్ రాలేకపోయారు. దీంతో సోషల్ మీడియాలో కేటీఆర్ స్పందించారు.
Also Read : తగ్గేదే లేదు.. యూఎన్ వేదికగా ఇరాన్‌కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఆ రెండు మ్యాప్‌లలో ఏముందంటే?
36గంటల నుంచి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నా. వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ మందులు వాడుతున్నా. త్వరలో కోలుకుంటా. తెలంగాణ భవన్ కు వస్తున్న హైడ్రా బాధితులకు పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయ విభాగం అండగా ఉంటుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.