Amit Shah chappals Bandi Sanjay : అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్!..టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సెటైర్లు..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ పర్యటనపై రాజకీయా దుమారం రేగుతోంది. షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని సందర్శించుకున్న సమయంలో అమ్మవారి ఆలయం వద్ద అమిత్ షాకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పులు తీసి అందించటంపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Amit Shah chappals Bandi Sanjay : అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్!..టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల సెటైర్లు..

Amit Shah chappals Bandi Sanjay

Updated On : August 22, 2022 / 3:15 PM IST

Amit Shah chappals Bandi Sanjay : కేంద్ర హోం మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ పర్యటనపై రాజకీయా దుమారం రేగుతోంది.షా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని సందర్శించుకున్న సమయంలో అమ్మవారి ఆలయం వద్ద షాకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పులు తీసి అందించినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీనిపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు కూడా ఓ అవకాశం దొరికింది అన్నట్లుగా సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజారాతీ గులాములం అంటూ మంత్రి కేటీఆర్ సెటైర్ వేస్తే..బీజేపీలో బీజేపీ నేతల పరిస్థితి ఇది అంటూ కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ సెటైర్ వేశారు. షాకు బండి సంజయ్ చెప్పులు తీసి ఇచ్చిన వీడియో షేర్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Also read : Bandi Sanjay : అమిత్ షాను తాకటమే అదృష్టంగా భావిస్తా : బండి

గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ? అంటూ బండి సంజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. భవిషత్తులో అమిత్ షా కాళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెడతారనడానికి ఇదో ఉదాహరణ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఈ వీడియోపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా సెటైర్ వేస్తూ..ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ!’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.