KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో హుందాగా ఉండకుండా కేసీఆర్‌పై దిగజారుడు మాటలు..

KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్

KTR

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన అనంతరం తొలిసారి రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులకు ఎంతో మంచి చేసిన బీఆర్ఎస్ పార్టీని అనవసరంగా ఓడించుకున్నామని మాట్లాడుకుంటున్నారని అన్నారు.

హామీలు అమలు చేయలేమని తెలిసే గ్యారంటీలు ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పారు. అసత్యాలు ప్రచారం చేసి కామారెడ్డిలో బీజేపీలో గెలుపొందిందని అన్నారు. ప్రజలు 39 స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించి ప్రతిపక్ష హోదాను ఇచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలు ఇచ్చారని అన్నారు.

హామీల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిందని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఊరుకోబోమన్నారు. యాసంగి పంటకు బోనస్ ఇచ్చే జీవోను ఎన్నికల కోడ్‌కు ముందే తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో హుందాగా ఉండకుండా కేసీఆర్‌పై దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. మహిళలకు రూ.2,500 పెన్షన్లు, రైతులకు రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కుంగిన మూడు మేడిగడ్డ పిల్లర్లను బాగుచేయిస్తే రైతులకు సాగు నీరు వచ్చేదని చెప్పారు.

Also Read: శ్రీ కృష్ణుడి పాత్ర మీది.. అర్జునుది పాత్ర నాది: పొత్తులపై జగన్ కామెంట్స్