‘‘నువ్వు దొరికావు.. రాజీనామా తప్పదు’’ అంటూ కేటీఆర్ ట్వీట్

బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు.

‘‘నువ్వు దొరికావు.. రాజీనామా తప్పదు’’ అంటూ కేటీఆర్ ట్వీట్

KTR and Revanth Reddy

Updated On : September 29, 2024 / 7:41 PM IST

అమృత్ స్కామ్ హ్యాష్‌ట్యాగ్‌తో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. బావమరిదితో లీగల్ నోటీసు పంపితే ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా? అని అడిగారు.

బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన బావమరిది శోధ కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం అని పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7, 11, 13ని ముఖ్యమంత్రి ఉల్లంఘించిన మాట నిజమని చెప్పారు.

శోధ్ అనే కంపెనీ గత రెండు సంవత్సరాలుగా రెండు కోట్ల రూపాయలు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ అని తెలిపారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ దోస్తులు కూడా రేవంత్ రెడ్డిని కాపాడడం కష్టమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా, నిజాయితీగా ఉన్నదని చెప్పారు. ”ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్ లాగా, నువ్వు దొరికావు. రాజీనామా తప్పదు” అని అన్నారు.

సభలో మాట్లాడుతుండగా ఖర్గేకు అస్వస్థత.. ఆ సమయంలోనూ ఏమన్నారో తెలుసా?