Kunamneni Sambasiva Rao : కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించకపోయినా మేం పాటిస్తాం : కూనంనేని
కాంగ్రెస్ తో అవగాహనలో భాగంగా సీపీఐకి కాంగ్రెస్ రెండు స్థానాలు ఇస్తానంది అన్నారు. మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామని చెప్పారు.
Kunamneni Sambasiva Rao Respond : తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుల అంశం ప్రాసెస్ లో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూస్తామని తెలిపారు. ఆ తర్వాత తమ నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించకపోయినా తాము పాటిస్తామని వెల్లడించారు. తాము ఏం చేయాలన్న దానిపై తమకు స్పష్టత ఉందన్నారు.
గురువారం మరోసారి తమ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అవుతారని తెలిపారు. సీపీఎం వైఖరిపై తామేమీ నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ తో అవగాహనలో భాగంగా సీపీఐకి కాంగ్రెస్ రెండు స్థానాలు ఇస్తానంది అన్నారు. మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ లో నేతలను ఎందుకు చేర్చుకున్నారో తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందని అనుకుంటున్నామని తెలిపారు.
CPI – CPM : కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తుపై కొనసాగుతున్న సందిగ్థత
జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యం : డీ.రాజా
తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుల చర్చలు కొనసాగుతున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. తాము అడిగిన సీట్లు ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో తమ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. బీజేపీని ఓడించేందుకు కలిసి వచ్చే వారితో పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు.