93 ఏళ్ల వయస్సు..ఏడో నిజాం కుమార్తె బషీరున్నీసా బేగం ఇకలేరు…

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 12:41 PM IST
93 ఏళ్ల వయస్సు..ఏడో నిజాం కుమార్తె బషీరున్నీసా బేగం ఇకలేరు…

Updated On : July 29, 2020 / 1:03 PM IST

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమార్తె సాహెబ్ జాదీ బషీరున్నీబేగం (93) కన్నుమూశారు. పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణలో ఉన్న ఉస్మాన్ కాటేజ్ భవన్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెల్లడించారు.



పురానీ హవేలీకి సమీపంలో ఉన్న మసీదుకు తరలించారు మతపెద్దలు. బంధువులు, బనాజా సమాజ్ నిర్వహించారు. ఆమె మృతిపట్ల పలువురు సంతాపం తెలియచేశారు. నిజాం మనవడు నవాబ్ జాఫ్ ఆలీఖాన్ అంత్యక్రియలు జరిగాయి.

1906లో అజమ్ ఉన్నీసా బేగంతో మీర్ ఉస్మాన్ కు వివాహమైంది. 1927లో బషీరున్నీసా బేగం జన్మించారు. ఈమె భర్త…నవాబ్ ఖాజీంయార్ జంగ్ గతంలోనే చనిపోయారు. 34 మంది సంతానంలో జీవించి ఉన్న ఏకైక కుమార్తె. అందరూ చనిపోగా..బషీరున్నీసా బేగం జీవించి ఉన్నారు.



ఇప్పుడు ఈమె కూడ తుదిశ్వాస విడవడంతో..మీర్ ఉస్మాన్ తదుపరి తరం అంతరించినట్లైంది. ఆమెకు కుమారుడు, కుమర్తె ఉన్నారు. అయితే..కుమారుడు మాత్రం ఎక్కడో తప్పిపోయాడు. దాదాపు 25 సంవత్సరాలైనా..అతని ఆచూకి తెలియరాలేదు.