Lasya Nanditha : లాస్య నందిత కారు ప్రమాదం కేసులో కీలక మలుపు

దివంగత కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

Lasya Nanditha : లాస్య నందిత కారు ప్రమాదం కేసులో కీలక మలుపు

Lasya Nanditha

Patancheru Police : కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పటాన్ చెరు పోలీసులు కేసు విచారణలో భాగంగా లాస్య ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టిన టిప్పర్ లారీని ఐడెంటీపై చేశారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్ ను ఢీకొట్టడం వల్లనే లాస్య కారు ప్రమాదానికి గురైందని పోలీసులు భావిస్తున్నారు. టిప్పర్ ను పోలీసులు సీజ్ చేశారు. టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, ఏ సమయంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది.. వంటి విషయాలపై టిప్పర్ డ్రైవర్ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

Also Read : ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం.. కీలక విషయాలు చెప్పిన పోలీసులు, ప్రమాదానికి అసలు కారణం అదే

ఇప్పటికే లాస్య నందిత సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదం సమయంలో కారు డ్రైవ్ చేస్తున్న ఆకాశ్ పై పలు సెక్షన్ల కింద పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆకాశ్ స్టేట్ మెంట్ తీసుకున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ పై సీసీ పుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. కారు ఏ సమయానికి ఓఆర్ఆర్ పైకి వచ్చింది.. ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే విషయాలపై విచారణ చేస్తున్నారు. కారు అతివేగంగా వెళ్లి టిప్పర్ ను వెనుక నుంచి ఢీకొట్టి, ఆ తరువాత రెయిలింగ్ ను ఢీకొట్టిందని పోలీసులు ఇప్పటికే నిర్ధారణ కువచ్చారు. ప్రస్తుతం టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదానికి సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు.

Also Read : Lasya Nandita: లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..

గత నెల పటాన్ చెరు పరిధిలోని రింగ్ రోడ్డుపై లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తెల్లవారు జామున లాస్య నందిత కారులో ప్రయాణిస్తునుండగా.. ఆమె పీఏ ఆకాశ్ కారు నడుపుతున్నారు. ఓఆర్ఆర్ పై కారును వేగంగా పోనివ్వడంతో అదుపు తప్పి ముందువెళ్తున్న టిప్పర్ లారీని కారు ఢీకొట్టింది. ఆ వెంటనే ఓఆర్ఆర్ రెయిలింగ్ ను ఢీకొట్టింది. కారు ప్రమాదం సమయంలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నందిత సీటు బెల్ట్ పెట్టుకున్నా, ఎయిర్ బ్యాగ్ లు తెచుకున్నా ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా, కారు నడుపుతున్న ఆకాశ్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.