Kavitha Arrest : ముందుగానే కవిత పేరుతో విమాన టికెట్ బుక్ చేశారు- ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై న్యాయవాది

కోర్టులపై మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాం.

Kavitha Arrest : ముందుగానే కవిత పేరుతో విమాన టికెట్ బుక్ చేశారు- ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై న్యాయవాది

Kavitha Arrest : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పూర్తిగా చట్ట విరుద్ధం అన్నారు ఆమె న్యాయవాది మోహిత్ రావు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. సోదాల పేరుతో వచ్చి అరెస్ట్ చేశారని, ముందుగానే కవిత పేరు మీద విమాన టికెట్ బుక్ చేశారని చెప్పారు. చట్ట విరుద్ధంగా ఈడీ వ్యవహరించిందన్న మోహిత్ రావు.. దీనిపై కోర్టుకు వెళ్తామన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కవిత అడ్వొకేట్ మోహిత్ రావు తెలిపారు.

‘గతంలో కవితపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోమని ఈడీ చెప్పింది. కానీ, ఇప్పుడు చట్ట విరుద్ధంగా ఈడీ వ్యవహరించింది. కవిత అరెస్ట్ పూర్తిగా ఇల్లీగల్. సుప్రీంకోర్టులో కేసు పూర్తయ్యే వరకు ఈడీ చెప్పిన బలవంతపు చర్యలు తీసుకోమనే అంశం వర్తిస్తుంది. ముందస్తు ప్లాన్ లో భాగంగా కవితను అరెస్ట్ చేశారు. సోదాల పేరుతో వచ్చి అరెస్ట్ చేశారు.

ముందుగానే కవిత పేరుతో విమాన టికెట్ బుక్ చేశారు. కవిత ముందు చాలా న్యాయ అవకాశాలు ఉన్నాయి. అరెస్ట్ ను సవాల్ చేస్తాం. చట్ట విరుద్దంగా ఈడీ వ్యవహరించిందని కోర్టుకు వెళ్లొచ్చు. న్యాయవ్యాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కోర్టులపై మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాం. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు’ అని కవిత న్యాయవాది మోహిత్ రావు అన్నారు.

కవిత రాత్రంతా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులోనే ఉండనున్నారు. ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. భారీగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. రేపు(మార్చి 16) ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. కవిత అరెస్ట్ ను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఎన్నికల వేళ రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కవిత్ అరెస్ట్ ను ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్.

 

Also Read : కవిత అరెస్ట్.. చంద్రబాబుని ఉద్దేశించి కేటీఆర్ చేసిన పోస్టు వైరల్