కరోనా వైరస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

  • Published By: veegamteam ,Published On : March 31, 2020 / 11:50 AM IST
కరోనా వైరస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

Updated On : March 31, 2020 / 11:50 AM IST

కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రజలందరు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి గురించి డాక్టర్ నాగేశ్వరావ్ రెడ్డి చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. 

ఈ వైరస్ అనేది అంతా ప్రమాదకరమైనది ఏమి కాదు అని,  ఇంకో రెండు మూడు వారాల పాటు సోషల్ డిస్ట్రెన్స్ అనేది పాటించటం వల్ల ఈ వైరస్ ప్రభావం తగ్గిపోతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఈ వైరస్ పై ప్రజలకి అవగాహాన కల్పించి మంచి పని చేస్తున్నారు. ఈ వైరస్ కి మందులు అనేవి నార్మల్ గా అవసరం లేదు. కానీ కొన్ని మెడికల్ సమస్యలు ఉన్న వారు మాత్రం హైడ్రాక్సి క్లోరిన్ తీసుకోవటం వల్ల వారికి ఈ వైరస్ నుంచి కొంత రక్షణ కల్పింవచ్చునని ఐసిఎమ్ఆర్, డబ్ల్యూహెచ్ఓ రికమాండ్ చేస్తుంది. కానీ ఇప్పటికే హైడ్రాక్సి క్లోరిన్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే మేము కొంతమందికి ప్రోపలాక్సిన్ అనే మెడిసెన్ సిఫార్సు చేస్తున్నాం. 

ఈ వైరస్ అనేది జలుబు, దగ్గు ద్వారా వస్తుంది. కానీ కొంతమందిలో జలుబు,దగ్గు ఎక్కువ ఉన్న వారికి యాంటీబయాటిక్స్ మెడిసెన్ ని 500మిల్లీ గ్రామ్స్ రూపంలో 5 రోజులు తీసుకుంటే సరిపోతుంది. కానీ కొంతమందికి ఊపిరి తీసుకోవటం వంటి సమస్యలు వచ్చినప్పుడు డాక్టార్ దగ్గరుకు వెళ్లటం మంచిది. వారిలో 2 శాతం మందికి పరిస్ధితి విషయం కావచ్చు. 5 శాతం మందికి మాత్రం ఇన్సెన్టెంటివ్ కేర్ లో ఉంచి యాంటీబయాటిక్స్ ఇవ్వటం, వెంటిలేటర్ల సహాయంతో చికిత్స అందిస్తాం. కొంతమంది ఈ వైరస్ అనేది జలుబు, దగ్గు వల్లే వస్తుందని అనుకుంటున్నారు. కానీ మేము చూస్తున్నాం కాదా 20 శాతం మందిలో  డయేరియా, వాంతులు, రుచి తెలియకపోవటం వల్ల కూడా గమనిస్తున్నాం. దీని ఎన్షియా అంటాం. ఇవి కూడా ఈ వైరస్ లక్షణాలుగా చెప్పవచ్చు. 

సాధారణంగా ఈ వైరెస్ అనేది వ్యాపించటానికి వయసుతో సంబంధం లేదు. బయాలాజికల్ వయసు కన్నా ఫిజికల్ వయసు ముఖ్యమైనది. కొంతమంది 60 సంవత్సరాల వయసులో కూడా యోగా చేస్తారు. 65 సంవత్సరాలు పైబడి ఉన్న డయాబెటిక్స్, బిపి, క్యాన్సర్ ఉన్న వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడటం వల్ల వారు జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ అనేది త్వరగా పెరగదు. దీని వల్ల మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటిమిన్స్ ఉండాలా చూసుకోవాలి. దాని కోసం విటమిన్ డి, సి, బి తరుచుగా తీసుకుంటు ఉండాలి.  విటమిన్ డి లోపం ఉండే వారిలో ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందుకే డైలీ విటమిన్ సి, బి తీసుకోమని మేము సిఫారస్సు చేస్తున్నాం. వీక్లీ ఒకటి విటమిన్ డి తీసుకోవటం కూడా మంచిది.

కానీ ఇప్పటివరకు మందులను ఎవరు కనిపెట్టలేదు. ఇప్పటికే చైనా, యుఎస్ఏ వంటి దేశాలలో ట్రైల్స్ జరుగుతున్నాయి.  కానీ ఈ ట్రైల్స్ జరిగి బయటకి రావటానికి ఇంక రెండు నెల సమయం పడుతుంది. అప్పుడు మందు అనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ ఏమి అంతా తీవ్రమైనది కాదు.

ఇటలీ, స్పెయిన్ లో వైరస్ ప్రభావం ఎక్కువ అవటానికి రెండు కారణాలు ఉన్నాయి. అవి
>ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లోకి వుహాన్ నుంచి అక్కడి ఎక్కువగా రాకపోకలు ఉండటం వల్ల వైరస్ త్వరగా వ్యాపించింది. 
>అంతేకాకుండా ఈ వైరస్ వ్యాపించిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం, వాళ్ల పాపులేషన్ 80 సంవత్సరాలు పైబడిన వారు ఎక్కువ. ఇటలీలో సిగిరెటు తాగే వాళ్లు ఎక్కువగా ఉండటం. వీళ్లలో వైరస్ ప్రభావం ఎక్కువ.

ఈ పరిశోధనల వల్ల చైనా నుంచి ఇటలీ, స్పెయిన్  వంటి దేశాల్లో వ్యాపించిన వైరస్ లో కొన్ని మార్పులు జరిగి ఎమైనో యాసిడ్ లాగా మారిపోయి ప్రమాదకర వైరస్ గా తయారైయింది. మన ఇండియాన్ వైరస్ కి కోమ్ములు లాగా మారింది. కొమ్ము చివర వీక్ గా తయారైయింది. ఈ వైరస్ అనేది మనకు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఇంకా దీనిపై పరిశోదనలు జరుగుతున్నాయి.  ఈ వైరస్ మన బాడీలో ఏ కణం పై ప్రభావం చూపుతుందో తెలుసుకుని కొన్ని డ్రగ్స్ ని  తయారు చేయవచ్చు అని అన్నారు. దీని బట్టి మన ఇండియన్ వైరస్ లో కొంత వీక్ కనుబడుతుంది. దీంతో పాటు లాక్ డౌన్ విధించటం వల్ల పరిస్ధితిని కొంతమేర అధిగమించవచ్చు అని చెబుతున్నారు. ఇప్పుడున్నా పరిస్ధితిని చూస్తే ఈ వైరస్ అనేది 5 రోజులకు డబుల్ అవుతుంది. కానీ లాక్ డౌన్ వల్ల ఇది అయ్యే పెరిగే అవకాశం కనిపించటం లేదు. మన ముందు ఉన్న రెండు, మూడు వారాలు లాక్ డౌన్ అనేది చాలా ముఖ్యం.

కరోనా వైరస్ అనేది ముందుగా వైల్డ్ జంతువుల్లో ఉండేది. కానీ ఒక చిన్న ఇమ్యుటేషన్ కారణం వల్ల జంతువుల నుంచి మనుషులకు వచ్చింది. ఈ వైరస్ అనేది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తిస్తుంది.  కానీ ఇది ఏమి గాలి ద్వారా వ్యాప్తి  చెందదు. ఈ వైరస్ అనేది ఒక మీటరు కన్నా తక్కువ దూరం ఉన్న వాళ్ల మీద మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రమే వస్తుంది.  ఈ వైరస్ అనేది ప్లాస్టిక్, స్టీల్ పై 48 గంటలు, పేపర్ , కార్డ్ బోర్డు పైన 12 నుంచి 24 గంటల పాటు ఉంటుంది. బట్టలు, దుప్పట్ల మీద దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ వైరస్ అనేది 1:3 నిష్పత్తిలో వ్యాపిస్తుంది.      

ఈ వైరస్ అనేది సమ్మర్ వల్ల బయట నుంచి ఎక్కువగా వ్యాపించదు. ఇండ్లలో, కూల్ ఉండే ప్రదేశాలు, ఆపీసుల్లో ఎయిర్ కండిషనర్ వల్ల వ్యాపిస్తుంది. ఈ వైరస్ అనేది మనుషుల్లో 14 రోజుల ఉంటుంది. ఆరోగ్యం గా బాగా  ఉన్న పీపుల్స్ కి కరోనా వైరస్ వస్తే 98 శాతం మంచిగా క్యూర్ అయిపోతారు. 5 శాతం మందిలో జ్వరం, బాడీ పెయిన్స్ ఎక్కువగా రావటం వల్ల వారికి తగ్గటానికి 4 రోజుల సమయం పడుతుంది. కొంతమందిలో పరిస్ధితి బాగా లేదు అనుకున్నావారిని ఇన్సెన్టెంటివ్ కేర్ లో ఉంచి చికిత్సను అందిస్తాం. 

కరోనా వైరస్ వల్ల మనలో చాలామందికి భయం పెరిగిపోయింది. కానీ పీపుల్స్ సంతోషంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పవర్ ను పెంపోందించవచ్చు. ఈ హైడ్రాక్సి క్లోరిక్ ఇవ్వటం వల్ల మనలో ఉన్న వైరస్ సెల్ ను చంపేస్తుంది. అందువల్ల దీని ఇస్తున్నారు. హైడ్రాక్సి క్లోరిన్ అనేది ఎక్కువగా కీళ్ల నొప్పులు, మలేరియా వంటి జబ్బులకు వాడటం జరుగుతుంది. కానీ ఈ హైడ్రాక్సి క్లోరిక్ వాడటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దీని పై కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనటానికి 12 నుంచి 16 నెలల సమయం పడుతుంది. ఎంత త్వరగా తయారు చేయాలన్న మినిమం 12 నెలల సమయం పడుతుంది. ఇప్పటికే 5 ల్యాబ్ ల్లో వైరస్ ని తయారు చేసి ట్రైల్స్ చేస్తున్నారు. మనకి వ్యాక్సిన్ అనేది వచ్చే సంవత్సరం చివరిలో ఉంటుంది. మన ప్రభుత్వం, ఐసిఎమ్ఆర్, మెడికల్ ల్యాబ్ కలిసి పని చేయటం వల్ల మనం వైరస్ ను అధిగమించవచ్చు అన్నారు. ఈ వైరస్ అనేది మనం అనుకున్నాంతా పెద్ద సమస్య ఏమి కాదు. మనం ఇప్పుడు పాటిస్తున్న సామాజిక దూరం, ప్రజలు భయపడకుండా ఉండటం వల్ల మనం రెండు, మూడు వారాల్లో ఈ పరిస్ధితిని నుంచి బయట పడవచ్చు అని డాక్టర్ నాగేశ్వరావు అన్నారు.