రెండు రోజులు మద్యం షాపులు, బార్లు బంద్
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసి ఉంటాయని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

Liquor shops closed for two days : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, క్లబ్బులు మూసి ఉంటాయని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలో శుక్రవారం (మార్చి 12, 2021) సాయంత్రం 4 నుంచి ఆదివారం (మార్చి 14, 2021) సాయంత్రం 4 గంటల వరకు మూసివేయనున్నట్టు తెలిపారు.
ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 17న ఉదయం నుంచి వైన్స్‌లు మూసి ఉంటాయని వివరించారు. ఈ నెల 14న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.