Telangana Local Body Polls : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కేసీఆర్ వచ్చినా కలిసి వెళ్తామన్న డిప్యూటీ సీఎం
బీసీల దశాబ్దాల కలను సాకారం చేస్తాం. బీసీ రిజర్వేషన్లకు రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి.

Telangana Local Body Polls : తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా సర్కార్ ప్యూహం రచిస్తోంది. కేంద్రాన్ని కూడా ఒప్పిస్తామని చెబుతోంది. బీసీ రిజర్వేషన్ల కోసం పంచాయతీల్లో కేంద్రం నిధులు ఆలస్యమైనా భరిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ నేతృత్వంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, కేసీఆర్ వచ్చినా కలుపుకుని వెళ్తామన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్నదే లక్ష్యం..
సమగ్ర కుల సర్వే లెక్కలతో సహా అసెంబ్లీలో చర్చించాం.. సభ ఆమోదం కూడా తెలిపింది. పూర్తి శాస్త్రీయంగా సర్వే నిర్వహించాం. దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో 3.1 శాతం మంది ప్రజలు సర్వేలో వివరాలు ఇవ్వలేదు. కొందరు ఉద్దేశపూర్వకంగానే వివరాలు ఇవ్వలేదు. కేసీఆర్, కేటీఆర్, పల్లా లాంటి వారు సర్వేలో కావాలనే పాల్గొనలేదు.
Also Read : కులగణన సర్వే.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
అప్పుడు సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం ఇస్తున్నాం. ఫిబ్రవరి 16 నుండి 28 వరకు మరోసారి సర్వే చేస్తాం. ఎన్యుమరేటర్లకు వారు వివరాలు ఇవ్వాలి. టోల్ ఫ్రీ నెబర్ ఇస్తున్నాం. రాష్ట్ర జనాభా లెక్కల్లోకి రావాలని కేసీఆర్, కేటీఆర్ లాంటి వారికి సూచిస్తున్నాం. మార్చి మొదటి వారంలో.. ప్రభుత్వం, క్యాబినెట్ ముందు ఉంచుతాం.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సభలో చట్టబద్ధత కల్పిస్తాం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తాం. కేంద్రానికి కూడా పంపిస్తాం. ప్రధాని, కేంద్ర పెద్దలను, దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలుస్తాం. బీసీ రిజర్వేషన్ బిల్లుకు జాతీయ స్థాయిలో మద్దతు కోరతాం. మద్దతు కోసం అన్ని పార్టీలను కలుపుకునిపోతాం.
Also Read : బాబోయ్.. తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..ఇదే కనుక ఉదయం పూట జరిగి ఉంటే..!
బీసీల దశాబ్దాల కలను సాకారం చేస్తాం. బీసీ రిజర్వేషన్లకు రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి. కుట్రలు మానుకుని కొన్ని పార్టీలు.. బీసీల కోసం కలిసి రావాలి. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలి. బీసీలకు న్యాయం జరగాలంటే.. మిగిలిన వారు కూడా సర్వేలో పాల్గొనాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలన్నదే మా లక్ష్యం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.