లాక్ డౌన్ కష్టాలు : చెడిపోయిన కోటి మొబైళ్లు..పనిచేయని ఫ్రిజ్, టీవీలు

  • Published By: madhu ,Published On : May 16, 2020 / 01:45 AM IST
లాక్ డౌన్ కష్టాలు : చెడిపోయిన కోటి మొబైళ్లు..పనిచేయని ఫ్రిజ్, టీవీలు

Updated On : June 26, 2020 / 8:42 PM IST

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ అందర్నీ కష్టాలు పాలు చేస్తోంది. ఎంతో మందికి ఉపాధి కోల్పోయింది. వివిధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వారి కష్టాలు అన్నీఇన్నీకావు. ప్రధానంగా ఎలక్ర్టానిక్ రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు..ప్రస్తుతం దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఇలా ఉంటే…ఇళ్లల్లో ఉండే ఫ్రిజ్ లు, టీవీలు, ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులు భారీగా చెడిపోయాయంట.

ప్రస్తుతం ఇవి రిపేర్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే..దేశ వ్యాప్తంగా ఎలక్ర్టానిక్ అండ్ ఎలక్ర్టికల్స్, సర్వీసు సెంటర్లు క్లోజ్ కావడమే ఇందుకు కారణం. లక్షకు పైగా ఫ్రిజ్ లు, లక్షకు పైగా టీవీలు, కోటి వరకు మొబైల్ ఫోన్లు చెడిపోయాయి. సెల్యూలర్, ఎలక్ర్టానిక్స్ అసోసియేషన్ తో పాటు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగదారులు, తయారీదారుల సంఘ సంయుక్త సర్వేలో వెల్లడైంది. 

లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితం కావడంతో…టైం పాస్ కావడాకి టీవీలు, సెల్ ఫోన్లను విపరీతంగా వాడేస్తున్నారు. వచ్చిన ప్రతి సీరియల్స్, సినిమాలను పదే పదే చూడటం, ఇతరత్రా వాటి కోసం సెల్ ఫోన్లలో సెర్చ్ చేసి చూడడంతో పాడైపోయాయి. ఫ్రిజ్ లను అధికంగా ఉపయోగించడంతో ఖరాబ్ అయ్యాయని తేలింది. లక్షన్నర వరకు రిఫ్రిజిరేటర్లు, 60 వేల వరకు ఏసీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతర మొబైల్స్ ఫోన్స్ అన్నీ కలిపి..సుమారుగా కోటి వరకు పాడై పోయి ఉంటాయని అంచనా.

ఎలక్ర్టానిక్ అండ్ ఎలక్ర్టికల్స్ సేల్స్ – సర్వీసు రంగం తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారు..అష్టకష్టాలు పడుతున్నారు. పూటగడవడమే కష్టమై పోతోందని వాపోతున్నారు. సర్వీసు సెంటర్లు సైతం మూత పడ్డాయి. పని ఉన్నా..చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ గండం ఎప్పుడు పోతుందా రిపేర్స్ చేసే వారు…తమ ఇంట్లో ఉన్న వస్తువులు ఎప్పుడు రిపేర్ అవుతాయని ఎదురు చూస్తున్నారు. 

Read Here>> జరభద్రం : సెల్ ఫోన్ ద్వారా కరోనా