జరభద్రం : సెల్ ఫోన్ ద్వారా కరోనా

కరోనా వైరస్ ఇంత స్పీడుగా ఎలా విజృంభించింది అనే దానికి సమాధానం రావడం లేదు. దీనిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైరస్ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు కృషి చేస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా కొనసాగుతుండగానే.. మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్ ద్వారా కరోనా వ్యాపిస్తుందని AIMS రాయ్ పూర్ అధ్యయనంలో తేలింది.
ప్రజలు ఎక్కువుగా వాడుతున్న సెల్ ఫోన్ ద్వారా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించారు. సెల్ ఫోన్ ఉపరితలంపై ఉండే వైరస్ చేతులు మారినప్పుడు, లేదా ఇతరులు తాకినప్పుడు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న పరిస్థితులు, ఇతర అంశాలను ఈ నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు.
ఇందులో హెల్త్ వర్కర్లు కీలకమని, రోగులను ట్రాక్ చేయడం, తాజా మార్గదర్శకాలను, నివేదికలను ఎప్పటికప్పుడు తెసుకుంటుంటారు. ఈ క్రమంలో సెల్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారని వైద్యులు వెల్లడించారు. సెల్ ఫోన్ ద్వారా కరోనా వైరస్ విస్తరించే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో…హెల్త్ వర్కర్లు, సాధారణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆసుపత్రుల్లో పనిచేసే వారు..అక్కడకు మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకపోవడమే బెటర్ అంటున్నారు. ఫోన్లను ఐసోప్రోఫైల్ అల్కాహాల్ కలిగిన శానిటైజర్ లేదా క్లోరాక్స్ డిస్ ఇన్పెక్టింగ్ వైప్స్ తో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Read Here>> మాట్లాడటం ద్వారా కూడా కరోనావైరస్ వేగంగా సోకుతుంది : సైంటిస్టుల హెచ్చరిక